SSMB 28 రూ.300కోట్ల బిజినెస్.. మహేష్, త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఎంతంటే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోతున్న మూడో చిత్రం పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమాకు మార్కెట్ లో అయితే మంచి డిమాండ్ వుంది అని కూడా చెప్పవచ్చు. ఇక సినిమా షూటింగ్ మొదలు కాకముందే బిజినెస్ డీల్స్ పై చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత? అలాగే డైరెక్టర్ హీరో పారితోషకాలు ఎంత? నిర్మాతకు దాదాపుగా ఏ స్థాయిలో లాభం వస్తుంది? అని వివరాల్లోకి వెళితే..

మహేష్ సినిమా కోసం..

మహేష్ సినిమా కోసం..

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాను తెరకెక్కిస్తే బిజినెస్ పరంగా అయితే నిర్మాతలకు మంచి లాభాలు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వీలైనంత వరకు కమర్షియల్ గా అన్ని రకాల అంశాలను పొందుపరుస్తూ మంచి డిమాండ్ వచ్చే విధంగా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు సినిమా కోసం కూడా అదే తరహాలో ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మేకింగ్ బడ్జెట్ ఎంతంటే

మేకింగ్ బడ్జెట్ ఎంతంటే

అయితే సినిమా షూటింగ్ కూడా మొదలు కాకముందే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ మొత్తంపై కూడా ఇప్పటికే క్లారిటీతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం మొదట మేకింగ్ బడ్జెట్ అయితే 90 కోట్ల వరకు అనుకుంటున్నట్లు సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ హారిక హాసిని ప్రొడక్షన్ లో భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయబోతున్న ట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఎంత?

త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఎంత?

ఇక ఈ సినిమాకు సంబంధించిన పారితోషికాల విషయానికి వస్తే దర్శకుడు త్రివిక్రమ్ సినిమా లాభాల్లో వాటా కంటే ముందే దాదాపు 50 కోట్ల వరకు పారితోషికం తీసుకోబోతున్నట్లు గా తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో దర్శకుడికే డిమాండ్ భారీ స్థాయిలో పెరిగింది. దానికితోడు మహేష్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కాబట్టి అతని రేంజ్ కు తగ్గట్టుగానే డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

మహేష్ పారితోషికం

మహేష్ పారితోషికం

ఒక స్టార్ హీరో మహేష్ బాబు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే పెరిగినట్లు సమాచారం. మినిమమ్ గ్యారెంటీ అనే విధంగా మహేష్ బాబు సినిమాలకు మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న SSMB 28 ప్రాజెక్టు కోసం హారిక హాసిని సంస్థ దాదాపు 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు గా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

సినిమాపై మొత్తం పెట్టుబడి!

సినిమాపై మొత్తం పెట్టుబడి!

ఇక ఈ సినిమా మేకింగ్ బడ్జెట్ 90 కోట్లు, ఆ తర్వాత హీరో, డైరెక్టర్.. మిగతా నటీనటులు టెక్నీషియన్ల మొత్తం పారితోషకాలు మేకింగ్ బడ్జెట్ తో కలిపితే మొత్తంగా 200 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ బడ్జెట్ ఇంతకంటే ఎక్కువగా వెళ్లకుండా త్రివిక్రమ్ కూడా పక్కాగా ప్రణాళికలతో సిద్ధమైనట్లు సమాచారం.

నిర్మాతకు వచ్చేది ఎంత?

నిర్మాతకు వచ్చేది ఎంత?

ఇక హారిక హాసిని సంస్థ దాదాపు రెండు వందల కోట్ల పెట్టుబడి పెడుతూ ఉంది కాబట్టి సినిమా తియేట్రికల్ బిజినెస్ 150 కోట్ల వరకు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మరొకవైపు నాన్ థియేట్రికల్ గా కూడా 150 కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తంగా సినిమా బిజినెస్ 300 కోట్లు జరిగిన కూడా నిర్మాతలకు 100 కోట్లు టేబుల్ ప్రాపర్టీ లోకి వచ్చినట్లు చెప్పవచ్చు. మరి నిర్మాత ప్లాన్ ప్రకారమే ఈ సినిమా బిజినెస్ జరుగుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X