Guntur kaaram 11 Days Collections: గుంటూరు కారం ఢమాల్.. అన్ని కోట్లు వచ్చినా.. ఇంకెంత రావాలంటే!
సూపర్ స్టార్ హీరో కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించనంత స్థాయికి ఎదిగిపోయాడు మహేశ్ బాబు. ఆరంభంలోనే ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకుని అసలైన సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.
అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇటీవలే'గుంటూరు కారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాకే వచ్చినా స్పందన మాత్రం భారీగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 11 రోజుల వసూళ్లను మీరే చూడండి!

క్రేజీ కాంబోలో వచ్చేసింది: సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'గుంటూరు కారం'. ఈ కమర్షియల్ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని ఇచ్చాడు.

గుంటూరు కారం బిజినెస్: మహేశ్ బాబు హీరోగా చేసిన 'గుంటూరు కారం'కు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ అయింది.

11వ రోజు ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం'కు 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో స్పందన తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 13 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 58 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

11 రోజుల్లో ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం' మూవీకి 11 రోజుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 32.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.44 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.97 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.30 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.78 కోట్లు, గుంటూరులో రూ. 8.10 కోట్లు, కృష్ణాలో రూ. 6.27 కోట్లు, నెల్లూరులో రూ. 3.57 కోట్లతో కలిపి.. రూ. 87.35 కోట్లు షేర్, రూ. 134.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: మహేశ్ బాబు - త్రివిక్రమ్ కలిసి చేసిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 87.35 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.58 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 11 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 108.38 కోట్లు షేర్‌తో పాటు రూ. 235 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మాస్ అండ్ ఎమోషనల్ స్టోరీతో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 108.38 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 24.62 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











