Guntur kaaram 12 Days Collections: మహేశ్‌మూవీకి 12 రోజుల్లో భారీగా.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలు కొంత కాలంగా పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం తెలుగులోనే తమ స్థాయిని పెంచుకుంటోన్నారు. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు.

ఈ మధ్య మంచి ఊపులో ఉన్న అతడు.. ఈ సంక్రాతికి 'గుంటూరు కారం' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాకే వచ్చినా స్పందన మాత్రం భారీగా వచ్చింది. కానీ ఇప్పుడు క్రమంగా డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'గుంటూరు కారం' 12 రోజుల వసూళ్లను మీరే చూడండి మరి!

Mahesh Babu Starrer Guntur kaaram Movie 12 Days Worldwide Collections

ఘాటుగా గుంటూరు కారం: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సినిమానే 'గుంటూరు కారం'. ఈ మాస్, ఫ్యామిలీ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని ఇచ్చాడు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 12 Days Worldwide Collections

గుంటూరు కారం బిజినెస్: మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం'కు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 12 Days Worldwide Collections

12వ రోజు ఎంత వచ్చింది?: 12వ రోజు 'గుంటూరు కారం'కు తెలుగు రాష్ట్రాల్లో స్పందన తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 34 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 12 Days Worldwide Collections

12 రోజుల్లో ఎంత వచ్చింది?: 12 రోజుల్లో 'గుంటూరు కారం' మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 33.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.39 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.82 కోట్లు, గుంటూరులో రూ. 8.13 కోట్లు, కృష్ణాలో రూ. 6.28 కోట్లు, నెల్లూరులో రూ. 3.58 కోట్లతో కలిపి.. రూ. 87.69 కోట్లు షేర్, రూ. 134.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 12 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 12 రోజుల్లో రూ. 87.69 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.47 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.61 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 12 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 108.75 కోట్లు షేర్‌తో పాటు రూ. 236 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 12 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మహేశ్ నుంచి వచ్చిన కమర్షియల్ మూవీ 'గుంటూరు కారం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 108.75 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 24.25 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X