Guntur kaaram 13 Days Collections: 134 కోట్ల సినిమా.. 13 రోజుల్లో వచ్చిదంతే.. మహేశ్ హిట్ కొట్టాలంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు... ఒక్క పాన్ ఇండియా చిత్రం తీయకపోయినా... ఆయనకు ఆ స్థాయి పాపులారిటీ క్రేజ్ మాత్రం ఉన్నాయి. ఇక నేషనల్ వైడ్ గా ఆయనకు గుర్తింపు ఉందనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తుండటంతో.. ఆయన స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. మహేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకు మొదట మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం మహేష్ దుమ్మురేపుతున్నాడు. ఇక 'గుంటూరు కారం' 13 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా... ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించగా... ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 13 Days Worldwide Collections

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గుంటూరు కారం'కు కూడా భారీగా బిజినెస్ నమోదు అయింది. నైజాంలో రూ. 42.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.74 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.35 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102.09 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.02 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20.09 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132.50 కోట్లు బిజినెస్ జరిగింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 13 Days Worldwide Collections

13 రోజుల్లో 'గుంటూరు కారం' మూవీకి మంచి ఆధరణ వస్తుంది. 12 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 108.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 236.02 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక 13వ రోజు... ఇండియాలో రూ.65కోట్ల నెట్ వసూలు కాగా... మొత్తంగా ఇండియాలో రూ.120.15 కోట్ల నెట్ వసూలు అయింది. ఇక ఇండియాలో రూ.140.25 కోట్ల గ్రాస్ వసూలు అయింది. ఇక ఈ సినిమా నార్త్ అమెరికాలో దుమ్ములేపుతుంది. అక్కడ 13 రోజుల్లో రూ.21.64 కోట్లు రాబట్టింది.

మహేశ్ నుంచి వచ్చిన కమర్షియల్ మూవీ 'గుంటూరు కారం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132.5 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లకు పైగా నమోదు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X