Guntur kaaram 14 Days Collections: 133 కోట్లు రావాలి.. కుమ్మేసిన మహేశ్ బాబు.. మొత్తం ఎన్ని కోట్లంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే సినిమా సినిమాకూ తమ రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కొంత కాలంగా హై రేంజ్ సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాకే వచ్చినా స్పందన మాత్రం భారీగా వచ్చింది. ఇలా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 14 రోజుల వసూళ్లను మీరే చూడండి మరి!

గుంటూరు కారం ఘాటుగా:సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందిన చిత్రమే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ఈ మాస్, ఫ్యామిలీ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని ఇచ్చాడు.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 14 Days Worldwide Collections

గుంటూరు కారం బిజినెస్:మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమాకు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ అయింది.

14వ రోజు ఎంత వచ్చింది?:సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'గుంటూరు కారం' చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే స్పందన వచ్చింది. అయితే, క్రమంగా ఇది డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 14వ రోజు ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 22 లక్షలు షేర్‌తో పాటు రూ. 40 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 14 Days Worldwide Collections

14 రోజుల్లో ఎంత వచ్చింది?:'గుంటూరు కారం' మూవీకి 14 రోజుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 33.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.48 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.85 కోట్లు, గుంటూరులో రూ. 8.15 కోట్లు, కృష్ణాలో రూ. 6.30 కోట్లు, నెల్లూరులో రూ. 3.60 కోట్లతో కలిపి.. రూ. 88.15 కోట్లు షేర్, రూ. 135.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:మహేశ్ బాబు - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 14 రోజుల్లో రూ. 88.15 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.49 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.65 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 14 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 109.29 కోట్లు షేర్‌తో పాటు రూ. 237 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 14 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 133 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో దీనికి రూ. 109.29 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 23.71 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X