Guntur kaaram 15 Days Collections: కుమ్మేసిన మహేశ్.. 15 రోజుల్లో కోట్ల వర్షం.. హిట్ కావాలంటే మాత్రం!

టాలీవుడ్‌లో తనదైన రీతిలో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ.. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ.. తన రేంజ్‌ను కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇలా ఇప్పటికే ఎన్నో క్రేజీ సినిమాలను అందించిన అతడు.. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' అనే చిత్రంతో వచ్చాడు.

ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాకే వచ్చినా స్పందన మాత్రం భారీగా లభించింది. ఇలా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది. మరి లేట్ లేకుండా మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 15 రోజుల వసూళ్లను మీరే చూడండి!

Mahesh Babu Starrer Guntur kaaram Movie 15 Days Worldwide Collections

గుంటూరు కారంతో మహేశ్: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ కమర్షియల్ మూవీనే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని ఇచ్చాడు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 15 Days Worldwide Collections

గుంటూరు కారం బిజినెస్: మహేశ్ నటించిన 'గుంటూరు కారం' సినిమాకు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 15 Days Worldwide Collections

15వ రోజు ఎంత వచ్చింది?: టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'గుంటూరు కారం' చిత్రానికి స్పందన క్రమంగా తగ్గిపోతూనే ఉంది. అయితే, రిపబ్లిక్ డే హాలీడే ఉండడంతో 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో దీనికి వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 92 లక్షలు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 15 Days Worldwide Collections

15 రోజుల్లో ఎంత వచ్చింది?: 15 రోజుల్లో 'గుంటూరు కారం' మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 33.53 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.59 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.88 కోట్లు, గుంటూరులో రూ. 8.20 కోట్లు, కృష్ణాలో రూ. 6.35 కోట్లు, నెల్లూరులో రూ. 3.61 కోట్లతో కలిపి.. రూ. 89.01 కోట్లు షేర్, రూ. 137.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 15 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: మహేశ్ బాబు - త్రివిక్రమ్ కలిసి చేసిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 15 రోజుల్లో రూ. 89.01 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.51 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.68 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 15 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 110.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 238 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 15 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 133 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో దీనికి రూ. 110.20 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 22.80 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X