Guntur kaaram 16 Days Collections: మహేశ్‌కు భారీ వసూళ్లు.. ఏకంగా అన్ని కోట్లు.. లాభాల్లోకి రావాలంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కమర్షియల్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ మధ్య కాలంలో తన రేంజ్‌ను పెంచుకునే చిత్రాలు చేస్తోన్న అతడు.. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' అనే మాస్ అండ్ ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన చిత్రంతో వచ్చాడు.

ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాకే వచ్చినా స్పందన మాత్రం భారీగా లభించింది. ఇలా ఈ చిత్రం అదిరే వసూళ్లను రాబడుతోంది. ఇంకెందుకు ఆలస్యం? మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 16 రోజుల వసూళ్లను మీరే చూడండి మరి!

Mahesh Babu Starrer Guntur kaaram Movie 16 Days Worldwide Collections

క్రేజీ మూవీతో వచ్చిన మహేశ్: టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు నటించిన పక్కా కమర్షియల్ సినిమానే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని ఇచ్చాడు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 16 Days Worldwide Collections

గుంటూరు కారం బిజినెస్: మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం'కు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 16 Days Worldwide Collections

16వ రోజు ఎంత వచ్చింది?: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చాయి. అయితే, మూడో వారంలో ఇది డౌన్ అవుతోంది. కానీ, ఈ వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంది. ఇలా రిపబ్లిక్ డేన భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. 16వ రోజు ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 50 లక్షలు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 16 Days Worldwide Collections

16 రోజుల్లో ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం' మూవీకి 16 రోజుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 33.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.58 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.90 కోట్లు, గుంటూరులో రూ. 8.22 కోట్లు, కృష్ణాలో రూ. 6.37 కోట్లు, నెల్లూరులో రూ. 3.62 కోట్లతో కలిపి.. రూ. 89.51 కోట్లు షేర్, రూ. 138.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 16 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 89.51 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.53 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.69 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 16 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 110.73 కోట్లు షేర్‌తో పాటు రూ. 239 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 16 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 133 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో దీనికి రూ. 110.73 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 22.27 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X