Guntur kaaram 17 Days Collections: మళ్లీ కుమ్మిన మహేశ్.. సండే ఊహించని విధంగా.. మొత్తం ఎన్ని కోట్లంటే!
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం నుంచి ప్రభావాన్ని చూపిస్తూ.. టాప్ హీరోగా దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ మధ్య కాలంలో తన రేంజ్‌ను మరింతగా పెంచుకునే చిత్రాలు చేస్తోన్న అతడు.. ఇటీవలే సంక్రాంతికి 'గుంటూరు కారం' అనే మరో కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాకే వచ్చినా రెస్పాన్స్ మాత్రం భారీగా లభించింది. ఇలా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. మరి మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 17 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!
మహేశ్ నుంచి క్రేజీ మూవీ:సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన క్రేజీ అండ్ కమర్షియల్ మూవీనే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని ఇచ్చాడు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలు పోషించారు. అలాగే, ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు.

గుంటూరు కారం బిజినెస్:మహేశ్ బాబు హీరోగా చేసిన 'గుంటూరు కారం'కు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ అయింది.
17వ రోజు ఎంత వచ్చింది?:హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి. అయితే, మూడో వారంలో ఇది క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. కానీ, ఈ వీకెండ్‌లో మాత్రం భారీ రెస్పాన్స్‌తో ఓ రేంజ్‌లో పుంజుకుంది. ఇలా ఈ చిత్రం 17వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 64 లక్షలు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది.

17 రోజుల్లో ఎంత వచ్చింది?:17 రోజుల్లో 'గుంటూరు కారం' మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 33.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.69 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.73 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.96 కోట్లు, గుంటూరులో రూ. 8.28 కోట్లు, కృష్ణాలో రూ. 6.45 కోట్లు, నెల్లూరులో రూ. 3.66 కోట్లతో కలిపి.. రూ. 90.08 కోట్లు షేర్, రూ. 138.90 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:మహేశ్ బాబు - త్రివిక్రమ్ కలిసి చేసిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 17 రోజుల్లో రూ. 90.08 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.54 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.71 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 17 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 111.33 కోట్లు షేర్‌తో పాటు రూ. 240 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 133 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లో దీనికి రూ. 111.33 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 21.67 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











