Guntur kaaram 18 Days Collections: కుమ్మిపడేసిన మహేశ్.. కోట్లకు కోట్ల వసూళ్లు.. ఇంతకీ మూవీ హిట్టేనా!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఇమేజ్‌తో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు. అందులో హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. పాతికేళ్ల నుంచి తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఇటీవలే 'గుంటూరు కారం' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలో మిక్స్‌డ్ టాకే వచ్చినా రెస్పాన్స్ మాత్రం భారీగా లభించింది. అయితే, వీక్ డేస్‌లో డౌన్ అవుతోంది. మరి మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 18 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!

Recommended Video

Guntur Kaaram Collections ఇంతకీ మూవీ హిట్టేనా .. | Mahesh Babu | Telugu Filmibeat

గుంటూరు ఘాటైన కథతో:సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రమే 'గుంటూరు కారం'. ఈ కమర్షియల్ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని ఇచ్చాడు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలు పోషించారు. అలాగే, ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 18 Days Worldwide Collections

గుంటూరు కారం బిజినెస్:సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం'కు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది.

18వ రోజు ఎంత వచ్చింది?:మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి. అయితే, మూడో వారంలో ఇది క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ చిత్రం 18వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 25 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసుకుంది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 18 Days Worldwide Collections

18 రోజుల్లో ఎంత వచ్చింది?:'గుంటూరు కారం' మూవీకి 18 రోజుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 33.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.74 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.75 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.98 కోట్లు, గుంటూరులో రూ. 8.30 కోట్లు, కృష్ణాలో రూ. 6.47 కోట్లు, నెల్లూరులో రూ. 3.67 కోట్లతో కలిపి.. రూ. 90.33 కోట్లు షేర్, రూ. 139.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 18 రోజుల్లో రూ. 90.33 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.72 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 18 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 111.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 240 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 18 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 133 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లో దీనికి రూ. 111.60 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 21.40 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X