Guntur kaaram 19 Days Collections: మహేశ్‌కు భారీ దెబ్బ.. మొత్తంగా కోట్ల వర్షం.. అదే జరిగితే నష్టమే!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా, వేగంగా సినిమాలు చేసే అతడు.. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశాడు.
దీనికి ఆరంభంలో మిక్స్‌డ్ టాకే వచ్చినా రెస్పాన్స్ మాత్రం భారీగా సొంతం అవుతోంది. కానీ, వీక్ డేస్‌లో పడిపోతూనే ఉంది. మరి మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 19 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!

క్రేజీ కాంబోలో వచ్చిన మూవీ: సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన కమర్షియల్ సినిమానే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలు పోషించారు. అలాగే, ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని ఇచ్చాడు.

గుంటూరు కారం బిజినెస్: మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం'కు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ అయింది.

19వ రోజు ఎంత వచ్చింది?: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా చేసిన 'గుంటూరు కారం' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు పోటెత్తుతున్నాయి. అయితే, మూడో వారంలో ఇది డౌన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం 19వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 15 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసుకుంది.

19 రోజుల్లో ఎంత వచ్చింది?: 19 రోజుల్లో 'గుంటూరు కారం' మూవీకి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 33.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.76 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.76 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.99 కోట్లు, గుంటూరులో రూ. 8.31 కోట్లు, కృష్ణాలో రూ. 6.48 కోట్లు, నెల్లూరులో రూ. 3.68 కోట్లతో కలిపి.. రూ. 90.48 కోట్లు షేర్, రూ. 139.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: కమర్షియల్ స్టోరీతో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 19 రోజుల్లో రూ. 90.48 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.56 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.73 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 19 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 111.77 కోట్లు షేర్‌తో పాటు రూ. 240 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మహేశ్ బాబు హీరోగా చేసిన 'గుంటూరు కారం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 133 కోట్లుగా నమోదైంది. ఇక, 19 రోజుల్లో దీనికి రూ. 111.77 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 21.23 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











