Guntur kaaram 7 Days Collections: 134 కోట్లు రావాలి.. వారంలో రికార్డు వసూళ్లు.. అన్ని కోట్లతో సంచలనం
తనదైన నటనతో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ.. సుదీర్ఘ కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మార్కును చూపిస్తూ దూసుకెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఫలితాలతో సంబంధం లేకుండా భారీ చిత్రాలు చేసే అతడు.. ఇటీవలే 'గుంటూరు కారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ప్రేక్షకుల స్పందన మాత్రం ఓ రేంజ్‌లోనే వస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' వారం రోజుల వసూళ్లను మీరే చూసేయండి!

గుంటూరు కారం అంటూ: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన క్రేజీ సినిమానే 'గుంటూరు కారం'. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు.

గుంటూరు కారం బిజినెస్: మహేశ్ నటించిన 'గుంటూరు కారం' మూవీకి నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది.

7వ రోజు ఎంత వచ్చింది?: 7వ రోజు 'గుంటూరు కారం'కు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ డౌన్ అయింది. ఫలితంగా నైజాంలో రూ. 25 లక్షలు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో కలిపి.. రూ. 2.83 కోట్లు షేర్, రూ. 5.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

7 రోజుల్లో ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం' మూవీకి 7 రోజుల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 31.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.59 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.21 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.20 కోట్లు, గుంటూరులో రూ. 7.72 కోట్లు, కృష్ణాలో రూ. 5.90 కోట్లు, నెల్లూరులో రూ. 3.29 కోట్లతో కలిపి.. రూ. 81.31 కోట్లు షేర్, రూ. 123.65 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 7 రోజుల్లో రూ. 81.31 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 101.46 కోట్లు షేర్‌తో పాటు రూ. 212 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో దీనికి రూ. 101.46 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 31.54 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
రీజనల్ మూవీల్లో టాప్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'గుంటూరు కారం' మూవీ వారం రోజుల్లోనే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ముఖ్యంగా ఇది రూ. 100 కోట్లు షేర్ మార్కును దాటింది. అలాగే, వారంలోనే రూ. 212 కోట్లు గ్రాస్‌తో రీజనల్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌కు చేరింది. అయితే, ఈ చిత్రం హిట్ కావాలంటే మాత్రం మరో 30 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











