Guntur kaaram 2 Days Collections: మహేశ్‌కు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు.. మొత్తం చూశారంటే!

చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా పరిచయమై.. దాదాపు 25 ఏళ్లుగా సత్తా చాటుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులు ఖుషీ చేస్తోన్న అతడు.. ఇప్పుడు 'గుంటూరు కారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఆడియెన్స్ రెస్పాన్స్ మాత్రం భారీ స్థాయిలోనే లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 2 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!

Mahesh Babu Starrer Guntur kaaram Movie 2 Days Worldwide Collections

క్రేజీ కాంబోలో భారీ సినిమా: త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 2 Days Worldwide Collections

గుంటూరు కారం బిజినెస్: 'గుంటూరు కారం' సినిమాకు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 2 Days Worldwide Collections

2వ రోజు ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం'కు తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 4.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 61 లక్షలు, కృష్ణాలో రూ. 66 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో కలిపి.. రూ. 8.57 కోట్లు షేర్, రూ. 13.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజుల్లో ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం' మూవీకి 2 రోజుల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 20.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.32 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.93 కోట్లు, గుంటూరులో రూ. 4.97 కోట్లు, కృష్ణాలో రూ. 3.22 కోట్లు, నెల్లూరులో రూ. 1.84 కోట్లతో కలిపి.. రూ. 47.45 కోట్లు షేర్, రూ. 66.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 2 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 47.45 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.00 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 63.15 కోట్లు షేర్‌తో పాటు రూ. 127 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 63.15 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 69.85 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 2 Days Worldwide Collections

ఒక్కసారిగా పడిపోయాయి: 'గుంటూరు కారం' మూవీకి మొదటి రోజు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో రూ. 38.88 కోట్లు రాబట్టింది. అయితే, రెండో రోజు మాత్రం ఈ చిత్రం ఒక్కసారిగా డౌన్ అయింది. ఫలితంగా దీనికి రూ. 8.57 కోట్లు మాత్రమే వచ్చాయి. రానున్న రోజుల్లో ఈ మూవీ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X