Guntur kaaram 3 Weeks Collections: 133 కోట్ల మూవీ.. 3 వారాల్లో రికార్డు వసూళ్లు.. మరి హిట్టేనా అంటే!

టాలీవుడ్‌లో ఇప్పుడు చాలా మందే బడా హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. చాలా కాలంగా తనదైన చిత్రాలతో అలరిస్తోన్న అతడు.. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశాడు. దీనికి ఆరంభంలో మిక్స్‌డ్ టాకే వచ్చినా రెస్పాన్స్ మాత్రం భారీగా సొంతం అవుతోంది. కానీ, వీక్ డేస్‌లో పడిపోతూనే ఉంది. మరి మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 3 వారాల వసూళ్లను మీరే చూసేయండి మరి!

గురూజీతో వచ్చిన మహేశ్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన కమర్షియల్ సినిమానే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలు పోషించారు. అలాగే, ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 21 Days Worldwide Collections

గుంటూరు కారం బిజినెస్ : మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమాకు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది.

21వ రోజు ఎంత వచ్చింది : ఈసారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు పోటెత్తాయి. అయితే, మూడో వారంలో మాత్రం ఇది ఆశించిన రీతిలో రాణించలేదు. ఈ క్రమంలోనే ఈ చిత్రం 21వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసుకుంది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 21 Days Worldwide Collections

21 రోజుల్లో ఎంత వచ్చింది : 'గుంటూరు కారం' మూవీకి 21 రోజుల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 33.84 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.80 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.98 కోట్లు, గుంటూరులో రూ. 8.30 కోట్లు, కృష్ణాలో రూ. 6.46 కోట్లు, నెల్లూరులో రూ. 3.67 కోట్లతో కలిపి.. రూ. 90.41 కోట్లు షేర్, రూ. 139.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత : కమర్షియల్ కంటెంట్‌తో వచ్చిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 21 రోజుల్లో రూ. 90.41 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.56 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.72 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 21 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 111.69 కోట్లు షేర్‌తో పాటు రూ. 240 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie 21 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి : మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 133 కోట్లుగా నమోదైంది. ఇక, 21 రోజుల్లో దీనికి రూ. 111.69 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 21.31 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X