Guntur kaaram 3 Days Collections: మహేశ్ సినిమాకు మరో షాక్.. 3వ రోజు ఊహించని విధంగా.. మొత్తం ఎంతంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. అందుకే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. వాళ్లను ఖుషీ చేసేందుకు ఈ బడా హీరో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ 'గుంటూరు కారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, రెస్పాన్స్ మాత్రం భారీగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 3 రోజుల వసూళ్లను మీరే లుక్కేయండి!
Recommended Video

మాస్ అండ్ సెంటిమెంట్:మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన మాస్ అండ్ సెంటిమెంట్ మూవీనే 'గుంటూరు కారం'. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.

గుంటూరు కారం బిజినెస్:మహేశ్ 'గుంటూరు కారం' మూవీకి నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ అయింది.
3వ రోజు ఎంత వచ్చింది?
'గుంటూరు కారం'కు తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు రెస్పాన్స్ కాస్త పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 3.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 74 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ. 76 లక్షలు, కృష్ణాలో రూ. 67 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో కలిపి.. రూ. 9.01 కోట్లు షేర్, రూ. 14.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజుల్లో ఎంత వచ్చింది?
3 రోజుల్లో 'గుంటూరు కారం' మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 24.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.27 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.41 కోట్లు, గుంటూరులో రూ. 5.73 కోట్లు, కృష్ణాలో రూ. 3.89 కోట్లు, నెల్లూరులో రూ. 2.21 కోట్లతో కలిపి.. రూ. 56.46 కోట్లు షేర్, రూ. 81.00 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 56.46 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.70 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 3 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 74.01 కోట్లు షేర్‌తో పాటు రూ. 137 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 74.01 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 58.99 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











