Guntur kaaram 4 Days Collections: 'గుంటూరుకారం'కు ఊహించని విధంగా కలెక్షన్లు.. 4రోజుల్లో ఎంత వచ్చిందంటే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ పండక్కి గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం మాత్రం ఆగడం లేదు. ఇక సోమవారం, పండగ రోజు సెలవు కావడంతో ఈ సినిమాకు బాగానే కలిసి వచ్చింది. ఈ క్రమంలో 4 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేద్దాం.
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన మాస్ అండ్ సెంటిమెంట్ చిత్రం 'గుంటూరు కారం'. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అలాగే... ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించగా... ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్ మీద రాధాకృష్ణ రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. పండగ కానుకగా ఈ మూవీ ప్రేక్షకల ముందుకు వచ్చింది.
Recommended Video


త్రివిక్రమ్ మహేశ్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం' చిత్రానికి నైజాంలో రూ. 42.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.74 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.26 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 100 కోట్లకు పైగా అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.01 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20.01 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ నమోదు చేసుకుంది.

4వ రోజు ఎంత వచ్చిందంటే.. 'గుంటూరు కారం'కు మొదటి మూడు రోజుల్లో రూ.164కోట్లు వచ్చింది. ఇక నాలుగవ రోజు.. పండగ రోజు కావడంతో జనాలు బాగానే థియేటర్లకు క్యూ కట్టారు. 4వ నైజాం - రూ. 4.17 కోట్లు, ఉత్తరాంధ్ర - రూ. 1.3 కోట్లు, కృష్ణ - రూ. 72 లక్షలు, గుంటూరు - రూ. 75 లక్షలు, వెస్ట్ - రూ. 52 లక్షలు, తూర్పు గోదావరి -రూ. 8 లక్షలు, నెల్లూరు - రూ. 4 లక్షలు, సీడెడ్ - రూ. 2 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా రూ. 10.66 కోట్లు షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది.
గుంటూరు కారం 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల షేర్లు చూసుకుంటే. నైజాం - రూ.35.32 కోట్లు, సీడెడ్ - రూ. 9.2 కోట్లు, గుంటూరు - రూ.7.88 కోట్లు, ఉత్తర ఆంధ్ర - రూ.7.94 కోట్లు, తూర్పు - రూ.6.71 కోట్లు, కృష్ణ - రూ. 4.88 కోట్లు, పశ్చిమ - రూ.4.37 కోట్లు, నెల్లూరు - రూ. 2.77 కోట్లు వసూలు అయ్యాయి. మొత్తంగా గుంటూరు కారం రూ.79.07 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక నాలుగు రోజుల్లో గుంటూరు కారం సినిమా రూ.175 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ 132 కోట్లు కాగా... ఇంకా రూ.50 కోట్లకు పైగా వసూలు చేస్తేనే హిట్ స్టేటస్ పొందుతుంది.


Click it and Unblock the Notifications











