Guntur kaaram 5 Days Collections: మహేశ్ సంచలన రికార్డు.. ఏకంగా అన్ని కోట్లు.. కానీ హిట్ కావాలంటే!
టాలీవుడ్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేసే హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలతో అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. ఈ బడా హీరో సంక్రాంతికి 'గుంటూరు కారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఆడియెన్స్ రెస్పాన్స్ మాత్రం భారీగానే వస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 5 రోజుల వసూళ్లను మీరే చూడండి!
క్రేజీ స్టోరీతో వచ్చిన మూవీ:మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన పక్కా కమర్షియల్ మూవీనే 'గుంటూరు కారం'. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు.

గుంటూరు కారం బిజినెస్:మహేశ్ నటించిన 'గుంటూరు కారం' మూవీకి నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది.
5వ రోజు ఎంత వచ్చింది?:'గుంటూరు కారం'కు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు రెస్పాన్స్ కాస్త తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 2.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, గుంటూరులో రూ. 62 లక్షలు, కృష్ణాలో రూ. 67 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో కలిపి.. రూ. 7.32 కోట్లు షేర్, రూ. 13.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజుల్లో ఎంత వచ్చింది?:'గుంటూరు కారం' మూవీకి 5 రోజుల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 30.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.88 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.42 కోట్లు, గుంటూరులో రూ. 7.09 కోట్లు, కృష్ణాలో రూ. 5.26 కోట్లు, నెల్లూరులో రూ. 2.94 కోట్లతో కలిపి.. రూ. 73.45 కోట్లు షేర్, రూ. 110.00 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 73.45 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13.40 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 92.45 కోట్లు షేర్‌తో పాటు రూ. 149.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 92.45 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 40.55 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
మహేశ్ మరో సంచలనం:సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్లు గ్రాస్ మార్కును దాటేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన అతి తక్కువ చిత్రాల జాబితాలో ఇది చేరిపోయింది.


Click it and Unblock the Notifications











