Guntur kaaram 8 Days Collections: మహేశ్‌కు బిగ్ షాక్.. తొలిసారి ఇంత తక్కువగా.. అన్ని కోట్లు రావాలా!
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలను చేస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటోన్న అతడు.. భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఈ క్రమంలోనే సంక్రాంతికి 'గుంటూరు కారం' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. కానీ, ప్రేక్షకుల స్పందన మాత్రం బాగానే వస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 8 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!

గుంటూరు ఘాటు చూపేలా: టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మాస్ అండ్ సెంటిమెంట్ మూవీనే 'గుంటూరు కారం'. థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు.

గుంటూరు కారం బిజినెస్: మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమాకు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ అయింది.

8వ రోజు ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం'కు 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో స్పందన తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 47 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 1.79 కోట్లు షేర్, రూ. 3.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

8 రోజుల్లో ఎంత వచ్చింది?: 8 రోజుల్లో 'గుంటూరు కారం' మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 31.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.06 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.57 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.48 కోట్లు, గుంటూరులో రూ. 7.80 కోట్లు, కృష్ణాలో రూ. 6.00 కోట్లు, నెల్లూరులో రూ. 3.37 కోట్లతో కలిపి.. రూ. 83.10 కోట్లు షేర్, రూ. 126.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 83.10 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.22 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 103.42 కోట్లు షేర్‌తో పాటు రూ. 214 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: కమర్షియల్ స్టోరీతో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 103.42 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 29.58 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











