Guntur kaaram 9 Days Collections: శనివారం షాకింగ్ వసూళ్లు.. 100 కోట్లు దాటినా.. హిట్ కావాలంటే మాత్రం!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను తనదైన సినిమాలతో ఫిదా చేస్తూ ముందుకు సాగిపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా సినిమాకూ తన మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకుంటోన్న అతడు.. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.
ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ లభించింది. కానీ, ప్రేక్షకుల స్పందన మాత్రం భారీగానే వస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' 9 రోజుల వసూళ్లపై మీరే లుక్కేయండి మరి!

గుంటూరు కారంతో మహేశ్: టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ కమర్షియల్ సినిమాకు థమన్ సంగీతాన్ని ఇచ్చాడు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు.

గుంటూరు కారం బిజినెస్: మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం'కు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది.

9వ రోజు ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం'కు 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో స్పందన మరింత తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 48 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి.. రూ. 1.67 కోట్లు షేర్, రూ. 3.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

9 రోజుల్లో ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం' మూవీకి 9 రోజుల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 32.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.88 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.59 కోట్లు, గుంటూరులో రూ. 7.90 కోట్లు, కృష్ణాలో రూ. 6.09 కోట్లు, నెల్లూరులో రూ. 3.44 కోట్లతో కలిపి.. రూ. 84.77 కోట్లు షేర్, రూ. 129.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 84.77 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.45 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 105.47 కోట్లు షేర్‌తో పాటు రూ. 216 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మాస్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన 'గుంటూరు కారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 105.47 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 27.53 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











