Guntur kaaram Closing Collections: 133 కోట్లు రావాలి.. కానీ వచ్చింది ఇంతే.. మహేశ్ మూవీకి నష్టం ఎంతంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న హీరోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు. గతంలో కంటే ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలతో వస్తోన్న అతడు.. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్‌ను తెచ్చుకున్నా.. రెస్పాన్స్‌ను మాత్రం భారీగానే సొంతం చేసుకుంటూ వచ్చింది. ఇలా ఈ సినిమా భారీ వసూళ్లనే తెచ్చుకుంది. కానీ, టార్గెట్‌ను చేరడంలో మాత్రం విఫలం అయింది. మరి 'గుంటూరు కారం' క్లోజింగ్ కలెక్షన్లను మీరే చూసేయండి మరి!

Mahesh Babu Starrer Guntur kaaram Movie Closing Worldwide Collections

గుంటూరు కారం అంటూ: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రమే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలు పోషించారు. అలాగే, ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు.

Mahesh Babu Starrer Guntur kaaram Movie Closing Worldwide Collections

గుంటూరు కారం బిజినెస్: మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం'కు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ అయింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie Closing Worldwide Collections

అలాంటి టాక్‌తో వసూళ్లు: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఊహించని విధంగా దీనికి రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్‌ను అందుకుంది. ఆ తర్వాత కూడా అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుని కలెక్షన్లను రాబట్టింది. కానీ, మూడో వారం నుంచి డౌన్ అవుతూనే వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie Closing Worldwide Collections

తెలుగులో ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం' మూవీకి ఫుల్ రన్‌లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 33.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.73 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.68 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.82 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6.00 కోట్లు, గుంటూరులో రూ. 8.32 కోట్లు, కృష్ణాలో రూ. 6.48 కోట్లు, నెల్లూరులో రూ. 3.69 కోట్లతో కలిపి.. రూ. 90.58 కోట్లు షేర్, రూ. 140 కోట్లు గ్రాస్ వచ్చింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie Closing Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: కమర్షియల్ స్టోరీతో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫుల్ రన్‌లో రూ. 90.58 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.57 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.73 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొత్తంగా ఈ చిత్రానికి రూ. 111.88 కోట్లు షేర్‌తో పాటు రూ. 189 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie Closing Worldwide Collections

టార్గెట్ ఇలా.. నష్టం అలా: మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 133 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి వరల్డ్ వైడ్‌గా రూ. 111.88 కోట్లు వచ్చాయి. అంటే ఈ సినిమాకు రూ. 21.12 కోట్లు నష్టాలు ఎదురయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X