Guntur kaaram Day 1 Collections: మహేశ్ పెను సంచలనం.. తొలి రోజే అన్ని కోట్లు.. ఆ మూవీల్లో టాప్ ప్లేస్
తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకుంటూ.. సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌లోనే ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఇలా ఇప్పుడు ఈ బడా హీరో 'గుంటూరు కారం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి రోజు డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. మరి లేట్ లేకుండా 'గుంటూరు కారం' మొదటి రోజు వసూళ్లను మీరే చూసేయండి.

రమణగా వచ్చేసిన మహేశ్: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.

గుంటూరు కారం బిజినెస్: 'గుంటూరు కారం' మూవీకి నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ అయింది.

అలాంటి టాక్‌తో రెస్పాన్స్: ఆరంభంలోనే మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుని 'గుంటూరు కారం' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా మంచిగానే లభించింది. ముఖ్యంగా ఈవినింగ్ షోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కిందని తెలుస్తోంది.

తొలి రోజు ఎంత వచ్చింది?: 'గుంటూరు కారం'కు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 16.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.05 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.01 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.60 కోట్లు, గుంటూరులో రూ. 4.36 కోట్లు, కృష్ణాలో రూ. 2.56 కోట్లు, నెల్లూరులో రూ. 1.54 కోట్లతో కలిపి.. రూ. 38.88 కోట్లు షేర్, రూ. 52.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 38.88 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 52.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 79.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'గుంటూరు కారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 52.03 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 80.97 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.
టాలీవుడ్‌లో నాలుగో స్థానం: 'గుంటూరు కారం' మూవీకి మొదటి రోజు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో రూ. 38.88 కోట్లు రాబట్టింది. తద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో నాలుగో స్థానానికి చేరింది. ఈ లిస్టులో RRR రూ. 74.11 కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత సలార్: సీజ్‌ఫైర్, బాహుబలి 2 మూవీలు ఉన్నాయి. నాన్ పాన్ ఇండియాలో మూవీల్లో మాత్రం ఇది టాప్ ప్లేస్‌కు చేరింది.


Click it and Unblock the Notifications











