Guntur karam: చరిత్ర సృష్టించిన మహేశ్ బాబు.. పరాయి దేశంలో పరాక్రమం.. RRR రికార్డు సమం
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. ఈ మధ్య కాలంలో అతడు తనదైన చిత్రాలను చేస్తూ మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'గుంటూరు కారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం యూఎస్‌లో అదిరిపోయే రికార్డును నమోదు చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
గుంటూరు మిర్చి ఘాటుతో:సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మూవీనే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు.

ఆ పనులతో ఫుల్ బిజీగా:దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో ఇటీవలే దీన్ని కంప్లీట్ చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం చేసేశారు. ఆ తర్వాత పనులను కూడా శరవేగంగా చేస్తూ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
గుంటూరు కారం సందడి:సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను వదలబోతున్నారు. అలాగే, కొన్ని ఈవెంట్లను కూడా ప్లాన్ చేశారు. వీటితో పాటు చిత్ర యూనిట్‌తో కొన్ని ఇంటర్వ్యూలను కూడా నిర్వహించబోతున్నారు. దీంతో ఈ వారం అంతా ఈ మూవీ సందడే కనిపిస్తుంది.

అక్కడ కూడా భారీ రిలీజ్:పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా తీసుకు వస్తున్నారు. దీంతో దీనికి జనవరి 12న 'హనుమాన్' నుంచి కూడా పోటీ నెలకొంది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమాను వందల లొకేషన్లలో వేల షోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.
ఏకంగా అన్ని షోలు రెడీ:పాజిటివ్ బజ్‌తో భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న 'గుంటూరు కారం' మూవీ యూఎస్ ప్రీమియర్స్‌ను హక్కులు తీసుకున్న పత్యంగిర సంస్థ భారీగా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ఏకంగా 5408 షోలు ప్రదర్శించబోతుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేసి ప్రకటించింది. తద్వారా మహేశ్ బాబు పలు రికార్డులను నమోదు చేసుకున్నాడు.

RRR రికార్డుకు సమంగా:తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన చిత్రాల్లో యూఎస్‌లో అత్యధిక ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయిన సినిమాగా RRR (5408 షోలు) గతంలో రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు దీన్ని మహేశ్ బాబు 'గుంటూరు కారం' సమం చేసింది. తద్వారా అతడి కెరీర్‌లోనే టాప్ మూవీ అవడంతో పాటు నాన్ పాన్ ఇండియా సినిమా విభాగంలోనూ మొదటి స్థానానికి చేరుకుంది.


Click it and Unblock the Notifications











