గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్ : యూఎస్‌లో మహేశ్ రాంపేజ్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
నటనకు నటన, డ్యాన్స్, ఫైట్స్, పంచ్ డైలాగ్స్‌తో పాటు హ్యాడ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తూ.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో టాప్ హీరోగా సత్తా చాటుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మిగిలిన హీరోలు అందరూ పాన్ ఇండియాపై ఫోకస్ చేస్తుండగా.. అతడు మాత్రమే టాలీవుడ్‌లో తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు.
Recommended Video

ఇందులో భాగంగానే వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఇది యూఎస్‌లో రికార్డు సాధించింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

గుంటూరు కారం అంటూ: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు.

రిలీజ్‌కు రెడీ.. ప్రమోషన్: 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు పాటలను కూడా విడుదల చేసింది. అలాగే, ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయబోతుంది. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసింది. దీంతో ఈ మూవీ హడావిడి ఓ రేంజ్‌లో కనిపిస్తుందని చెప్పొచ్చు.

యూఎస్‌లో రికార్డు రిలీజ్: మహేశ్ బాబు నటిస్తోన్న 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ జనవరి 12వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. ముఖ్యంగా జనవరి 11న ఈ సినిమాకు సంబంధించి 5408 ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేస్తోంది.

500 కొట్టేసిన సూపర్ స్టార్: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. అక్కడ 351 లొకేషన్లలో 1152 షోలకు గానూ అమ్మకాలు ప్రారంభించగా.. ఇప్పటికే 20003 టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 500K డాలర్లు అంటే రూ. 4 కోట్లు వరకూ గ్రాస్ వసూలు అయింది.

ఏకంగా అన్ని మూవీలు: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'గుంటూరు కారం' మూవీ యూఎస్‌లో 500K డాలర్ల మార్కును దాటేసింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన అతడి తొమ్మిదో సినిమాగా ఇది నిలిచింది. దీంతో టాలీవుడ్‌లో ఎక్కువ సార్లు 500K డాలర్లు మార్కును చేరుకున్న హీరోగా మహేశ్ బాబు సంచలన రికార్డు క్రియేట్ చేశాడు.


Click it and Unblock the Notifications











