Murari Re Release Collections: దంచికొట్టిన మహేశ్ బాబు.. 2 రోజుల్లో కోట్ల వర్షం.. ఇండియాలో 3వ సినిమాగా!
ఇప్పుడున్న పోటీ వల్ల ఎలాంటి కాన్సెప్టులతో వచ్చిన సినిమాలైనా హిట్ కావాలంటే కష్టంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఒక ట్రెండ్‌లా మారిపోయింది. ఇలా ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన చిత్రమే 'మురారి'. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ క్లాసిక్ మూవీ భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే దీనికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తోంది. మరి 'మురారి' రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
గ్రాండ్‌గా మురారి రిలీజ్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ రూపకల్పనలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన సినిమానే 'మురారి'. సొనాలి బింద్రే హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. అప్పట్లో క్లాసికల్ హిట్‌గా నిలిచిన దీన్ని మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రీ రిలీజ్ చేశారు. ఇలా వరల్డ్ వైడ్‌గా 1000కి పైగా థియేటర్లలో తీసుకొచ్చారు.

అదిరిపోయిన రెస్పాన్స్
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. వాటన్నింటికీ మించేలా 'మురారి' మూవీకి హడావిడి కనిపించింది. అందుకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ చిత్రానికి అనుకున్న దానికంటే అత్యధిక కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే వసూళ్లు భారీగా వస్తున్నాయి.
2వ రోజు ఎన్ని కోట్లంటే
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'మురారి' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనికి రికార్డులు బ్రేక్ చేసే రేంజ్‌లో వసూళ్లు కూడా లభించాయి. ఈ క్రమంలోనే రెండో రోజు కూడా ఈ సినిమా అంచనాలు నిలబెడుతూ మంచిగానే హోల్డ్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 1.76 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

2 రోజులకూ కలిపి ఇలా
'మురారి' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన లభించింది. దీంతో 2 రోజుల్లో నైజాంలో రూ. 4.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 42 లక్షలు, ఆంధ్రాలో రూ. 1.53 కోట్లతో కలిపి రూ. 6.16 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 54 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 62 లక్షలు వసూలు అయ్యాయి. ఇలా రెండు రోజుల్లో రూ. 7.32 కోట్లు గ్రాస్ వచ్చింది.
ఇండియాలో మూడోది
పాత సినిమాల రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని చిత్రాలు టాప్ కలెక్షన్లతో సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మురారి సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానానికి చేరుకుంది. ఈ లిస్టులో 'గిల్లి' రూ. 32.50 కోట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇక, పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషి' రూ. 7.46 కోట్లతో రెండో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications











