Murari Re Release Collections: మహేశ్ బాబు సంచలనం.. రీరిలీజ్ మూవీతో టాప్ రికార్డు

తెలుగు సినిమా రంగంలో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తూ దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. పక్కా కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. వరుసగా మూవీల మీద మూవీలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు. అదే సమయంలో తన పాత చిత్రాల ద్వారా కూడా ఈ బడా హీరో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఇలా ఇటీవలే మహేశ్ బాబు 'మురారి' సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇది భారీ వసూళ్లతో దుమ్ములేపుతోంది. ఈ నేపథ్యంలో 'మురారి' 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

పండగల మురారి రిలీజ్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా చేసిన సినిమానే 'మురారి'. సొనాలి బింద్రే హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. అప్పట్లో క్లాసికల్ హిట్‌గా నిలిచిన దీన్ని మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రీ రిలీజ్ చేశారు. ఇలా వరల్డ్ వైడ్‌గా 1000కి పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

Mahesh Babu Starrer Murari Re-Release 4 Days Worldwide Collections Report

అదిరిపోయిన రెస్పాన్స్

ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. వాటికి కనిపించని విధంగా 'మురారి' మూవీకి హడావిడి కనిపించింది. అందుకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ చిత్రానికి అత్యధిక కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే ఇది రికార్డులు సాధిస్తోంది.

4వ రోజు ఎన్ని కోట్లంటే
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'మురారి' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనికి రికార్డులు బ్రేక్ చేసే రేంజ్‌లో వసూళ్లు కూడా లభించాయి. ఈ క్రమంలోనే రెండో రోజు, మూడో రోజు కూడా ఇది సత్తా చాటుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 7.00 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయింది.

Mahesh Babu Starrer Murari Re-Release 4 Days Worldwide Collections Report

4 రోజులకూ కలిపి ఇలా

'మురారి' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన లభించింది. దీంతో4 రోజుల్లో నైజాంలో రూ. 4.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఆంధ్రాలో రూ. 1.77 కోట్లతో కలిపి రూ. 7.17 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలు వసూలు అయ్యాయి. ఇలా నాలుగు రోజుల్లో రూ. 8.52 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఇక్కడ టాప్.. అక్కడ 2
ఓల్డ్ మూవీల రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని చిత్రాలు టాప్ కలెక్షన్లతో సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మురారి సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానానికి చేరుకుంది. ఈ లిస్టులో 'గిల్లి' రూ. 32.50 కోట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. మూడో స్థానంలో పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషి' రూ. 7.46 కోట్లతో ఉంది.

More from Filmibeat

Read more about: mahesh babu murari
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X