Murari Re Release Collections: చరిత్ర సృష్టించిన మహేశ్ బాబు.. టాలీవుడ్‌లో మురారి ఆల్‌టైం రికార్డు
తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో రీరిలీజ్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాలనో, అప్పుడు ప్రేక్షకులు ఆదరించని క్లాసిక్ మూవీలనో ఇప్పుడు మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు రాగా.. వాటికి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో ఆయా చిత్రాలకు మంచి కలెక్షన్లు కూడా దక్కాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ బాబు నటించిన 'మురారి' సినిమాను కూడా రీ రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ కలెక్షన్లను మీరే చూడండి!
మహేశ్ బర్త్‌డేకు మురారి
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ రూపొందించిన చిత్రమే 'మురారి'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అదిరిపోయే స్పందనతో భారీ వసూళ్లు సాధించింది. ఇలా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రీ రిలీజ్ చేశారు. దీన్ని ఏకంగా 1000 థియేటర్లలో తీసుకు వచ్చారు.

అంతటా భారీ రెస్పాన్స్
ఇప్పటికే ఎన్నో సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. కానీ, 'మురారి' రేంజ్‌లో దేనికీ హడావిడి కనిపించలేదని చెప్పొచ్చు. అందుకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే వసూళ్లు భారీగా లభించాయి.
ఫస్ట్ డే తెలుగు వసూళ్లు
'మురారి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 32 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలు రాబట్టింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత
'మురారి' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన లభించింది. దీంతో మొదటి రోజు కర్నాటకలో రూ. 20 లక్షలు, తమిళనాడులో రూ. 10 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 14 లక్షలు, యూఎస్‌లో రూ. 37 లక్షలు, మిగిలిన దేశాల్లో రూ. 20 లక్షలు గ్రాస్ వసూలు అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా మొదటి రోజే దీనికి రూ. 5.41 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ఆల్‌టైం రికార్డు నమోదు
రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని చిత్రాలు టాప్ కలెక్షన్లతో సత్తా చాటింది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'బిజినెస్‌మేన్' సినిమా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 4.37 కోట్లు రాబట్టింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 5.27 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ రికార్డును 'మురారి' మూవీ బ్రేక్ చేసి ఆల్‌టైం టాలీవుడ్ రికార్డు సాధించింది.

నైజాంలో టాప్ లేపేసి
తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియా ప్రభావం సినిమాల కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపిస్తూ ఉంటుంది. అక్కడ 'మురారి' మూవీ రూ. 2.93 కోట్లు రాబట్టింది. దీంతో రీరిలీజ్‌లో టాప్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ల ఘనతను కూడా అందుకుంది. వరల్డ్ వైడ్‌గా మాత్రం 'గిల్లి' సినిమా తర్వాతి స్థానంలో ఉండిపోయింది.


Click it and Unblock the Notifications











