Guntur Kaaram: 'గుంటూరు కారం'కు మైండ్ బ్లోయింగ్ బిజినెస్... మహేశ్ హిట్ కొట్టాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?

సంక్రాంతికి ఈ సారి బాక్సాఫీస్ పోరు మామూలుగా లేదు. ఒకటి కాదు రెండు కాదు.. 7 నుంచి 8 సినిమాలు బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ పండక్కీ సూపర్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ గట్టిగానే జరుపుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం ఇది కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. . హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు.

Mahesh Babu Trivikram Guntur Kaaram Movie World Wide Pre Release Business And Breakeven Details Here

తాజాగా గుంటూరు కారం సినిమాకు సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ వివరాలు బయటకు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొడంతో... మంచి బిజినెస్ జరుపుకుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్‌లకు ఈ సినిమా రికార్డ్ ప్రీ-బిజినెస్ జరుపుకుంది. ఇక ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతున్నా.. రికార్డు లెవెల్ బిజినెస్ అయితే నమోదు చేసుకుంది.

Mahesh Babu Trivikram Guntur Kaaram Movie World Wide Pre Release Business And Breakeven Details Here

ఈ సంక్రాంతికి నాగార్జున నా సామిరంగా, వెంటేష్ సైంధవ్, తేజ సజ్జా ప్రశాంత్ వర్మ హనుమాన్, రెండు తమిళ చిత్రాలు వస్తున్నాయి. వీటి అన్నింటిలో కూడా మహేశ్ సినిమా అత్యధిక బిజినెస్ జరుపుకుంది. గుంటూరు కారం ఏరియాల వారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూస్తే... నైజాం - రూ.42 కోట్లు, సీడెడ్ - రూ.14 కోట్లు, ఉత్తరాంధ్ర - రూ.14.5 కోట్లు, తూర్పు గోదావరి - రూ.8.8 కోట్లు, గుంటూరు - రూ.7.8 కోట్లు, పశ్చిమ గోదావరి - రూ.6.5 కోట్లు, కృష్ణ - రూ.6.5 కోట్లు, నెల్లూరు - రూ.4 కోట్ల బిజినెస్ చేసుకుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సినిమాకు మొత్తంగా రూ. 104.1 కోట్ల బిజినెస్ చేసుకోగా... రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని ఈ సినిమా రూ.9.5 కోట్లు, ఓవర్సీస్ - రూ. 21 కోట్లు జరుపుకుంది. ఇక గుంటూరు కారం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకుని రూ.134.6 కోట్లుగా బిజినెస్ జరుపుకుంది. ఇది మహేశ్ కెరియర్లో బిగ్గెస్ట్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కావాలంటే... దాదాపు రూ.135 కోట్లకు పైగా రాబట్టాలి.

ఇక మహేశ్ ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా.. ఆయనకు ఇండియా వైడ్ క్రేజ్ ఉంది. ఇక మహేష్ కు రూ.135 కోట్లు పెద్ద లెక్క కాదని మహేశ్ ఫ్యాన్స్ అంటున్నారు. జనవరి 12న వస్తున్న గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X