'ది బిజినెస్ మ్యాన్' ఓవర్ సీస్ రైట్స్ ఎంతంటే
మహేష్ బాబు తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ 8.4 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.ఇప్పటివరకూ ఏ తెలుగు చిత్రం ఈ రేంజిలో అమ్ముడుపోలేదు. దాంతో దర్శక, నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక "సాదారణంగా అందరు మనుషులతో మాట్లాడితే... నేను మాత్రం బుల్లెట్లతో మాట్లాడతా..నా గన్ కి లైసెన్స్ లేదు.. నా లైఫ్ కి ఇన్సురెన్స్ లేదు." వంటి డైలాగులతో ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరగటం కూడా సినిమా మార్కెట్ కి బాగా ప్లస్సైంది. ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు.. అమ్మకాల చుట్టూ తిరగనుంది. ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు. గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది.'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందిస్తున్న చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











