»   » మహేష్ దూకుడు చెన్నై రిపోర్టు ఏంటి?

మహేష్ దూకుడు చెన్నై రిపోర్టు ఏంటి?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    మహేష్ బాబు లేటెస్ట మూవీ దూకుడు తెలుగునాటే కాదు తమిళనాడులోనూ అదే రోజు రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు తమిళనాడులో ఏ హీరోకు లేనంతగా మహేష్ కు ఆదరణ దక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటివరకూ మన వాళ్ళ సినిమాలు పెద్దగా అక్కడ ఆడలేదు. కానీ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ సాధించటం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది. చెన్నై లో ఇరవై ఒక్క ధియేటర్లలో రిలీజ్ అయిన తమిళేతర సినిమా దూకుడే. కేవలం బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాలు మాత్రమే తమిళనాడులో ఇంతగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఆ తరువాత అంతటి రేంజ్ ను సంపాదించింది కేవలం మహేష్ మాత్రామే. చెన్నై లోని సత్యం సినిమాస్ అనే మల్టీప్లెక్స్ లో అన్ని దియేటర్లు ఈ వారాంతం వరకు హౌస్ పుల్ అయిపోయాయి. చెన్నై తో పాటు తమిళనాడులో మరి కొన్ని నగరాలలో కూడా దూకుడు రిలీజ్ అవుతుంది. వేల్లూర్, కాంచీపురం, తిర్వల్లూర్, తిరిచే, మదురై, తాంబరం, హోసూర్, రామంతపురం, నాగానల్లూర్ వంటి తమిళ సిటీస్ లోష్ విడుదల అవుతున్న తొలి తెలుగు సినిమా దూకుడే. మహేష్ దూకుడు చిత్రం ఇప్పటికే ఎక్కడ విన్నా చాలా పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ రిపోర్టు వినపరడుతోంది. ఈ నేపధ్యంలో ఆ చిత్రాన్ని మళకయాళంలో రీమేక్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    ఇక తమిళనాడు విషయానికి వస్తే చెన్నయ్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 17 థియేటర్లలో విడుదలైంది ఎన్నడూ లేని విధంగా. అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినీ నిర్మాతల నుంచి అందిన సమాచారం దూకుడు సినిమా తొలి రోజు దాదాపు రూ. 9 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే రూ. 2 కోట్లు వసూలు చేసిందని డిస్టిబ్యూటరీ వర్గాలు అంటున్నాయి. మరి కొన్ని రోజుల్లో దూకుడు ఇంతకు ముందు వచ్చిన సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు అభిమానులు. మహేష్ బాబు, సమంత జంటగా నటించిన దూకుడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్నాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, షాయాజీ షిండే, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తుండగా...థమన్, కె.వి. గుమన్, గోపీ మోహన్, కోన వెంకట్, కోటి పరుచూరి, ఎ.ఎస్. ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, రామజోగయ్య శాస్త్రీ, భాస్కరభట్ల, విశ్వ సాంకేతిక నిపుణులు.

    English summary
    Mahesh Babu-Dookudu.. In AP the film collected around Rs5.1 Cs rupees on first day of its release.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more