మహేష్ "ఖలేజా" మొదటి రోజు కలెక్షన్స్ ఇవే...
మహేష్ బాబు తాజా చిత్రం "ఖలేజా" మొదటి రోజు కలెక్షన్స్ ని చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మీడియాకు తెలిపారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆంధ్రాలో నాలుగు కోట్ల ముప్పై లక్షలు ఈ చిత్రం మొదటి రోజు వసూలు చేసింది. ఏరియాల వారిగా చూస్తే...నైజాం (1.3 కోట్లు), సీడెడ్ (97 లక్షలు), గుంటూరు (59 లక్షలు), కృష్ణ (31.5 లక్షలు), వెస్ట్ (35లక్షలు), ఈస్ట్ (28 లక్షలు), నెల్లూరు (21లక్షలు), వైజాగ్ (28 లక్షలు). ఇక సి.కళ్యాణ్ మాట్లాడుతూ..నెగిటివ్ రివ్యూలు, సినిమాకి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం తట్టుకుని మహేష్ ఖలేజా భాక్సాఫీస్ వద్ద రికార్డు స్ధాయి కలెక్షన్స్ సాధించింది. మహేష్ బాబు నిజమైన బలం ఏంటో నిరూపించింది అన్నారు.
సి కళ్యాణ్ అనుష్క మహేష్ బాబు సునీల్ త్రివిక్రమ్ అతడు ఖలేజా c kalyan anushka mahesh babu sunil trivikram athadu khaleja


Click it and Unblock the Notifications