ఏకంగా ‘బాహుబలి’ రికార్డునే బద్దలు కొట్టిన మహేశ్.. ప్రభాస్‌తో పాటు పవన్‌కూ దెబ్బేశాడు.!

By Manoj

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉండే ప్రాధాన్యతే వేరు. అదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీకీ ఈ సీజన్ ఎంతో ప్రత్యేకమైనది. అందుకే పండుగ సమయంలో తమ తమ సినిమాలను విడుదల చేసేందుకు చాలా మంది ఫిల్మ్ మేకర్లు పోటీ పడుతుంటారు. ఈ సీజన్ నుంచే టాలీవుడ్‌ బాక్సాఫీస్ మొదలవుతుంది. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా కొన్ని బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ఏకంగా బాహుబలి రికార్డునే బద్దలు కొట్టేసింది. ఇంతకీ ఏంటా రికార్డు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

సరిలేరు అనేలా ప్లాన్ చేసుకున్నారు

సరిలేరు అనేలా ప్లాన్ చేసుకున్నారు

వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కలిసి చేసిన చిత్రమే ‘సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఇందులో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, సంగీత, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దేవీ శ్రీ సంగీతం అందించాడు.

రెండు సినిమాలున్నా ఇదే ట్రెండ్

రెండు సినిమాలున్నా ఇదే ట్రెండ్

ఈ సంక్రాంతికి రెండు బడా సినిమాలు విడుదలయ్యాయి. సరిలేరుతో పాటు అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో' కూడా ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినప్పటికీ మహేశ్ సినిమానే ఎక్కువ ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఈ సినిమా ఒకరోజు ముందు విడుదల అవడమే. దీంతో దానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

 ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి అవీ కారణమే

ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి అవీ కారణమే

సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి ఆ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ కూడా కారణమే. ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు, టీజర్, ట్రైలర్, గ్లింప్స్ సహా పోస్టర్లు అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. వీటిల్లో కొన్నింటికి అత్యధిక వ్యూస్ కూడా వచ్చాయి. దీతో ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో పాటు ప్రేక్షకుల్లోకి చొచ్చుకెళ్లింది.

పండుగకు బొమ్మ దద్దరిల్లిపోయింది

పండుగకు బొమ్మ దద్దరిల్లిపోయింది

భారీ అంచనాల నడుమ శనివారం విడుదలైన సరిలేరు నీకెవ్వరుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటిరోజే మంచి టాక్ సంపాదించడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేశాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, బెంగళూర్, చెన్నైలలో ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది.

కలెక్షన్లను అధికారికంగా ప్రకటించారు

కలెక్షన్లను అధికారికంగా ప్రకటించారు

ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీని ప్రకారం.. ఈ మూవీ నైజాంలో 8.66 కోట్లు, సీడెడ్‌లో 4.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 4.4 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 3.35 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2.72 కోట్లు, గుంటూరులో 5.15 కోట్లు, కృష్ణాలో 3.07 కోట్లు, నెల్లూరులో 1.27 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 32.77 కోట్లు రాబట్టింది.

‘బాహుబలి' రికార్డునే బద్దలు కొట్టిన మహేశ్

‘బాహుబలి' రికార్డునే బద్దలు కొట్టిన మహేశ్

తొలి రోజు కలెక్షన్లలో మహేశ్ బాబు.. బాహుబలి రికార్డునే బద్దలు కొట్టేశాడు. నైజాంలోనే ప్రాముఖ్యం కలిగిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ మూవీ తొలిరోజు ఏకంగా రూ. 37.2 లక్షలు గ్రాస్ రాబట్టింది. తద్వారా బాహుబలి పేరిట ఉన్న రూ. 36 లక్షలు రికార్డును బద్దలు కొట్టింది. ఈ జాబితాలో సాహో రూ. 34.2 లక్షలు, పవన్ అజ్ఞాతవాసి రూ. 28.9 లక్షలతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X