టాప్ 7 డిజిటల్ & శాటిలైట్ రైట్స్.. మరోసారి నెంబర్ వన్ స్థానంలోకి మహేష్.. SVP ధర ఎంతంటే?
ఒక బిగ్ బడ్జెట్ సినిమా నలువైపులా అనుకున్నట్లుగా మార్కెట్ చేయగలిగితే చాలా వరకు నిర్మాత సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో రూపొందించే నిర్మాతలు ఆ విషయంలో చాలా లక్కీ అనే చెప్పాలి. వీలైనంత వరకు మహేష్ తన క్రేజ్ తోనే భారీ లాభాలు అందిస్తూ ఉంటాడు. విడుదలకు ముందే భారీగా లాభాలు అందించడంలో మహేష్ తరువాతే ఎవరైనా. టాప్ 7 డిజిటల్ & శాటిలైట్ రైట్స్ లలో మహేష్ సర్కారు వారి పాట నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

మహేష్ మిస్సయ్యాడు..
2020 సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా అన్ని మార్గాల్లో కూడా మంచి లాభాలను అందించింది. ఇక 2021ని మహేష్ మిస్ కావాల్సి వస్తోంది. చాలా మంది అగ్ర హీరోల సినిమాలు గత ఏడాదిలోనే రావాల్సి ఉండగా అనుకోకుండా కరోనా ధాటికి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక మహేష్ బాబు నెక్స్ట్ మరో సంక్రాంతిని టార్గెట్ చేశాడు.

మార్కెట్ వాల్యూ మామూలుగా లేదు
సర్కారు వారి పాటతో సిద్ధం కానున్న మహేష్ బాబు ఆ సినిమాతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడా అని అభిమానుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గీత గోవిందం వంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు. దీంతో మార్కెట్ లో సినిమా వాల్యూ గట్టిగానే పెరుగుతోంది.
దానికంటే ఎక్కువ ధరకు

దానికంటే ఎక్కువ ధరకు
డిజిటల్ & శాటిలైట్ రైట్స్ మార్గాల్లో మహేష్ సినిమాలు 20కోట్లకు తక్కువ రాబట్టడం లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా ఆ మార్గాల్లో 27.50కోట్లను అందించింది. ఇదే అత్యదిక ధరకి అమ్ముడైన సినిమా అనుకుంటే ఇప్పుడు దానికంటే ఎక్కువ ధరకు సర్కారు వారి పాట డామినేట్ చేసింది.

Array
సర్కారు వారి పాట డిజిటల్ శాటిలైట్ రైట్స్ కలిపి మొత్తం 35కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హయ్యెస్ట్ ధర. ఇప్పటివరకు ఏ హీరో సినిమా కూడా ఈ రూట్లో 26కోట్లను దాటలేదు. సర్కారు వారి పాట తరువాత మహర్షి, వినయ విధేయరామ్ 25కోట్లు, F3 25కోట్లు, సరిలేరు నీకెవ్వరు 24.50కోట్లు, అరవింద సమేత 23కోట్లు, అల.. వైకుంఠపురములో 20కోట్లతో ధరకు అమ్ముడయ్యాయి.
Recommended Video

సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..
2020లో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కెరీర్ బెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక నెక్స్ట్ ఈ అదే సమయానికి సర్కారు వారి పాటను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో ఒక సీనియర్ హీరో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











