'బిజినెస్ మ్యాన్'పై మహేష్ కి అదే డౌట్
'నేను కొడితే ఎలా వుంటదో ఆళ్ళూ, ఈళ్ళూ చెప్పడమే గానీ నాకు తెలీదు' అంటూ ఈ రోజు బిజినెస్ మ్యాన్ చిత్రంతో మహేష్ వస్తున్నాడు. అప్పట్లో పోకిరితో మళ్లీ మొన్న 'దూకుడు'తో తన రికార్జులు తనే తిరగరాసుకున్న మహష్ కి ఈ చిత్రం అవుట్ పుట్ పై మొదటి నుంచీ నమ్మకం ఉందిట. అయితే ఆయనకు ఒకటే డౌట్. 70 రోజుల్లో ముగించేసిన ఈ చిత్రం షూటింగ్ హడావిడికి అడ్జెస్టు కాలేక సినిమా క్వాలిటీ మీద మహేష్ సందేహపడ్డారు. అయితే తాజాగా ప్రసాద్ ల్యాబ్స్‌లో 'బిజినెస్‌మేన్' రన్ చూసిన మహేష్ , అందులో యాక్షన్ సీన్స్‌కి సంతృప్తి చెందినట్టు సమాచారం. ఆ సందేహాలు ఇప్పుడు తీరిపోయి హ్యాపీగా చిత్రం భాధ్యత ప్రేక్షకులపై వదిలేసి హ్యాపీగా ఉన్నారు.
ఇక ఇప్పుడు టెన్షన్ అంతా ఈ సినిమా నిర్మించిన ఆర్.ఆర్. మూవీమేకర్స్ ది. సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది కాదు వారి టెన్షన్. దూకుడు రికార్డులను దాటగలుగుతుందా లేదా అనేట. వారూ ఈ చిత్రం ప్రారంభించిన రోజునే విడుదల తేదీని ప్రకటించేసారు. అన్నట్లుగానే వారు ముందు చెప్పిన విడుదల తేదికి చిత్రాన్ని విడుదల చేసేస్తున్నారు. ఇంతకంటే తక్కువ రోజుల్లో ఆనాడు 'గాడ్‌ఫాదర్' లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమానే తీశారు కాబట్టి అస్సలు 'బిజినెస్‌మాన్' క్వాలిటీ గురించి బెంగ అక్కర్లేదు. ఇక వారి బెంగ అంతా 'దూకుడు' రికార్డ్స్ గురించే. ఇప్పుడు ఈ అంకెల్ని అధిగమించాలన్న పట్టుదల 'బిజినెస్‌మేన్' నిర్మాతలకీ పెరిగిపోయింది. అందుకే వారు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రెండువేల థియేటర్లలో విడుదల చేయడానికి సాహసిస్తున్నారు. అవకాశమున్న ఏ మార్కెట్‌నీ వదిలిపెట్టడంలేదు. జపాన్‌లోనూ కొత్తగా అడుగుపెడుతున్నారు. మరి బిజినెస్ మ్యాన్ ఆ రికార్డులను బ్రద్దలుకొట్టి కొత్త రికార్డులును క్రియోట్ చేస్తుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాలి.


Click it and Unblock the Notifications











