Maidaan Collections అజయ్ దేవగన్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లతో.. మైదాన్‌కు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సౌత్ స్టార్ హీరోయిన్ ప్రియమణి జంటగా రూపొందిన స్పోర్ట్స్ బయోపిక్ మైదాన్. హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జీ5, బోని కపూర్ నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బిజినెస్ ఎంత జరిగింది? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
మైదాన్ చిత్రం కథ విషయానికి వస్తే.. 1961 నుంచి భారతీయ ఫుట్‌బాల్ క్రీడలో చోటుచేసుకొన్న గెలుపు ఓటములు, రాజకీయాలు నేపథ్యంగా రూపొందింది. ఫుట్ బాల్ క్రీడకు సయ్యద్ అబ్దుల్ రహీం చేసిసన సేవలను, ఎదుర్కొన్న ఆటుపోట్లను భావోద్వేగంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన రిలీజ్ అయింది.

ఇక మైదాన్ సినిమాను ప్రతిభావంతులైన నటీనటుల మేళవింపుతో నిర్మించారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో సెట్స్ వేసి గ్రాండ్‌గా చిత్రీకరించారు. ముఖ్యంగా ఫుట్‌బాల్ ఆటకు సంబంధించిన ఎపిసోడ్స్‌ను కళ్లు చెదిరిపోయేలా షూట్ చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 90 కోట్ల రూపాయలు మేర అయింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 60 కోట్ల షేర్ థియేట్రికల్‌గా రాబట్టాల్సిన అవసరం ఉంది.
ప్రియమణి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు, సాధారణ ప్రేక్షకుల ఆదరణ లభించింది. అయితే ఈ సినిమాకు అనుకొన్నంతగా వసూళ్లు, ఓపెన్సింగ్ రాబట్టలేకపోయింది. కానీ అజయ్ దేవగన్ కెరీర్‌లో బెస్ట్ నంబర్స్‌ను బాక్సాఫీస్ వద్ద సొంతం చేసుకొన్నది. ఈ సినిమా 45 శాతం అక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది.

మైదాన్ సినిమాకు ఇండియాలో ప్రదర్శించిన ప్రీరిలీజ్ ప్రీమియర్లకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సినిమాకు 2.5 కోట్ల రూపాయలు షేర్ లభించింది. ఈ సినిమాకు మౌత్ పబ్లిసిటీ రావడంతో భారీ ఓపెనింగ్స్ రావడానికి కారణమైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక మైదాన్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. ఇండియాలో ఈ సినిమా 4.5 కోట్ల నికర వసూళ్లు సాధించగా..ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే ఇండియాలో 2.5 కోట్లు షేర్, ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్లు రాబట్టే అవకాశం ఉంది.
ఇక మైదాన్ చిత్రానికి గుడ్ రివ్యూస్ వచ్చినా గానీ.. కలెక్షన్లపై అంతగా ప్రభావం చూపించలేకపోతున్నది. ఈ సినిమా మూడో రోజు బాక్సాఫీస్ వద్ద 6 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా గత 3 రోజుల్లో 21 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











