Main Atal Hoon Collections మాజీ ప్రధాని వాజ్‌పేయ్ బయోపిక్ బడ్జెట్ 25 కోట్లు.. కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
భారత మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత అటల్ బీహారీ వాజ్‌పేయ్ జీవితంలో జరిగిన కీలక సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం మై అటల్ హు (Main Atal Hoon). బాలీవుడ్ దర్శకుడు రవి జాదవ్ డైరెక్షన్‌లో వినోద్ భనుషాలి, సందీప్ సింగ్, కమలేష్ భానుషాలీ ఈ సినిమాను నిర్మించారు. పంకజ్ త్రిపాఠి, పియూష్ మిశ్రా తదితరులు నటించారు. ఈ సినిమా జనవరి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ఎంత వసూలు చేస్తున్నదనే విషయాల్లోకి వెళితే..
మై అటల్ హూ (Main Atal Hoon) సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ మూవీని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 25 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ కాకపోవడంతో కమిషన్ బేస్ మీద రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా హిట్ కావాలంటే.. కనీసం 30 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వాల్యూ కట్టారు.

అటల్ బీహారి వాజ్‌పేయ్ అదర్శ నాయకుడు కావడం, అలాగే అతడి జీవితం అందరికి చేరువ కావాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఇండియాలో అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. దాదాపు ఈ సినిమాను 1000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఉత్తరాదిలో భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించారు.
మై అటల్ హూ (Main Atal Hoon) మూవీ థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. ఈ సినిమా తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 2.1 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.4 కోట్ల రూపాయాలు రాబట్టింది. ఇక నాలుగో రోజున 1 కోటి రూపాయలు వసూలు చేసింది. గత 4 రోజుల్లో ఈ మూవీ 7 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

ఇక మై అటల్ హు (Main Atal Hoon) మూవీ సాధిస్తున్న వసూళ్లను చూస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఈ సినిమా వారాంతంలో ఏదైనా భారీ వసూళ్లు రాబట్టగలిగితే.. లాభాలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











