మజిలీ 11 డేస్ కలెక్షన్ రిపోర్ట్: ఇక్కడ భారీ లాభాలు, అక్కడ అంతంత మాత్రమే!

Recommended Video

Majili Movie 11 Days Box Office Collections || Filmibeat Telugu

నాగ చైతన్య, సమంత, దివ్యాంన్ష కౌశిక్ ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మజిలీ'. ఏప్రిల్ 5న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుని నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేసిన ఈ చిత్రం... 11వ రోజుతో రూ. 30 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రీచ్ అయింది. సినిమా విడుదలైన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేయడంతో పాటు లాభాల బాటలోకి వెళ్లింది. ఏరియా వైజ్ లాభాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

నైజాంలో హయ్యెస్ట్ ప్రాఫిట్స్

నైజాంలో హయ్యెస్ట్ ప్రాఫిట్స్

‘మజిలీ' చిత్రానికి నైజాం ఏరియాలో హయ్యెస్ట్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ఈ ఏరియాకు రూ. 6 కోట్లకు అమ్మగా... 11 రోజుల్లో రూ. 10 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్ రూ. 4 కోట్ల లాభం సొంతం చేసుకున్నాడు. ఫుల్ రల్‌లో ఈమొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ ఏరియాల్లోనూ మంచి లాభాలు

ఈ ఏరియాల్లోనూ మంచి లాభాలు

సీడెడ్, ఉత్తరాంధ్ర, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కొనుగోలు చేసిన వారు కూడా మంచి లాభాలు పొందారు. సీడెడ్ రైట్స్ రూ. 2.50 కోట్లకు అమ్మగా ఇప్పటికే రూ. 3.31 కోట్ల షేర్ వసూలు చేసింది, ఉత్తరాంధ్ర రైట్స్ రూ. 1.98 కోట్లకు అమ్మగా రూ. 3.75 కోట్ల షేర్ రాబట్టింది. రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 1.50 కోట్లకు అమ్మగా రూ. 2.95 కోట్లు వసూలు చేసింది.

ఇక్కడ అంతంత మాత్రంగానే...

ఇక్కడ అంతంత మాత్రంగానే...

కొన్ని ఏరియాల్లో వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కృష్ణ రైట్స్ రూ. 1.28 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు రూ. 1.68 కోట్లు (రూ. 40 లక్షల లాభం) మాత్రమే రాబట్టింది. గుంటూరు రైట్స్ రూ. 1.62 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు 1.92 కోట్ల షేర్ (రూ. 30 లక్షల లాభం) రాబట్టింది.

జస్ట్ ఇప్పుడే బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయిన ఏరియాలు

జస్ట్ ఇప్పుడే బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయిన ఏరియాలు

వెస్ట్ గోదావరి రైట్స్ రూ. 1.12 కోట్లకు అమ్మగా 11 రోజుల తర్వాత 1.17 కోట్లు రాబట్టింది. నెల్లూరు రైట్స్ రూ. 70 లక్షలకు అమ్మగా ఇప్పటి వరకు 72 లక్షల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ రైట్స్ రూ. 3 కోట్లకు అమ్మగా సెకండ్ వీకెండ్ తర్వాత పెట్టుబడి తిరిగి వచ్చింది.

మజిలీ

మజిలీ

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించారు. నాగ చైతన్య, సమంత లీడ్ రోల్స్ చేయగా... దివ్యాంన్ష కౌశిక్ అనే బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. గోపీ సుందర్ సంగీతం, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X