Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘మజిలీ’కి కలిసొచ్చిన పోలింగ్ డే, పెరిగిన కలెక్షన్స్... ఓటేసి థియేటర్లకు పోటెత్తిన జనం!
నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'మిజిలీ' చిత్రం విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సూపర్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈచిత్రం విడుదలైన 5 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు లాభాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
అయితే నేడు ఎన్నికలు జరిగడం 'మజిలీ' చిత్రానికి కలెక్షన్ల పరంగా కలిసొచ్చింది. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించడమే ఇందుకు కారణం. చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకుని థియేటర్ల వైపు అడుగులు వేశారు.
థియేటర్లు హౌస్ ఫుల్, పెరిగిన కలెక్షన్స్
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బుధవారం ‘మజిలీ' కలెక్షన్స్ పరిశీలిస్తే.. మార్నింగ్ షో రూ. 46,221 వసూలవ్వగా... మ్యాట్నీకి రూ. 75,624 రాబట్టింది. పోలింగ్ డే రోజు అదే ఏరియాలో మార్నింగ్ షో రూ. 70, 710 వసూలవ్వగా, మ్యాట్నీ షో హౌస్ ఫుల్ అయింది. ఇదే పరిస్థితి సినిమా విడుదలైన అన్ని చోట్ల కనిపించింది.
నైజాంలో వసూళ్లు అదుర్స్
నైజాం ఏరియాలో ‘మజిలీ' చిత్రం ఇప్పటికే రూ. 7 కోట్ల షేర్ సాధించి లాభాల బాటలోకి వెళ్లింది. ఈ వీకెండ్ సమయానికి టోటల్ వసూళ్లు రూ. 10 కోట్లను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ వసూళ్లు దుమ్మురేగిపోయేలా ఉన్నాయి.
వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత?
‘మజిలీ' చిత్రాన్ని అన్ని ఏరియాలకు కలిపి వరల్డ్ వైడ్ రూ. 21.14 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. పాజిటివ్ టాక్ రావడంతో తొలి 5 రోజుల్లోనే రూ. 21.61 కోట్ల వరల్డ్ వైడ్ షార్ సాధించి లాభాల్లోకి వెళ్లింది. ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
మజిలీ
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించారు. నాగ చైతన్య, సమంత లీడ్ రోల్స్ చేయగా... దివ్యాంన్ష కౌశిక్ అనే బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. గోపీ సుందర్ సంగీతం, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.