twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మజిలీ’కి కలిసొచ్చిన పోలింగ్ డే, పెరిగిన కలెక్షన్స్... ఓటేసి థియేటర్లకు పోటెత్తిన జనం!

    |

    నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'మిజిలీ' చిత్రం విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సూపర్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈచిత్రం విడుదలైన 5 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు లాభాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

    అయితే నేడు ఎన్నికలు జరిగడం 'మజిలీ' చిత్రానికి కలెక్షన్ల పరంగా కలిసొచ్చింది. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించడమే ఇందుకు కారణం. చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకుని థియేటర్ల వైపు అడుగులు వేశారు.

    థియేటర్లు హౌస్ ఫుల్, పెరిగిన కలెక్షన్స్

    థియేటర్లు హౌస్ ఫుల్, పెరిగిన కలెక్షన్స్

    ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బుధవారం ‘మజిలీ' కలెక్షన్స్ పరిశీలిస్తే.. మార్నింగ్ షో రూ. 46,221 వసూలవ్వగా... మ్యాట్నీకి రూ. 75,624 రాబట్టింది. పోలింగ్ డే రోజు అదే ఏరియాలో మార్నింగ్ షో రూ. 70, 710 వసూలవ్వగా, మ్యాట్నీ షో హౌస్ ఫుల్ అయింది. ఇదే పరిస్థితి సినిమా విడుదలైన అన్ని చోట్ల కనిపించింది.

    నైజాంలో వసూళ్లు అదుర్స్

    నైజాంలో వసూళ్లు అదుర్స్

    నైజాం ఏరియాలో ‘మజిలీ' చిత్రం ఇప్పటికే రూ. 7 కోట్ల షేర్ సాధించి లాభాల బాటలోకి వెళ్లింది. ఈ వీకెండ్ సమయానికి టోటల్ వసూళ్లు రూ. 10 కోట్లను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ వసూళ్లు దుమ్మురేగిపోయేలా ఉన్నాయి.

    వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత?

    వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత?

    ‘మజిలీ' చిత్రాన్ని అన్ని ఏరియాలకు కలిపి వరల్డ్ వైడ్ రూ. 21.14 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. పాజిటివ్ టాక్ రావడంతో తొలి 5 రోజుల్లోనే రూ. 21.61 కోట్ల వరల్డ్ వైడ్ షార్ సాధించి లాభాల్లోకి వెళ్లింది. ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

    మజిలీ

    మజిలీ

    శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించారు. నాగ చైతన్య, సమంత లీడ్ రోల్స్ చేయగా... దివ్యాంన్ష కౌశిక్ అనే బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. గోపీ సుందర్ సంగీతం, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

    English summary
    'Majili' collections increased on poll day. Most offices have declared holiday on the eve of Lok Sabha polls in Hyderabad, the theaters have seen increase in footfalls. ‘Majili’ is directed by Shiva Nirvana and it starred Naga Chaitanya and Samantha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X