మజిలీ బాక్సాఫీస్ కలెక్షన్స్: చైతు, సమంత క్రేజ్‌తో తొలిరోజు దూకుడు.. సెకండ్ హైయెస్ట్!

Recommended Video

Majili Movie First Day Box Office Collections Report || Filmibeat Telugu

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి మంచి రివ్యూలు ఇస్తున్నారు. కలెక్షన్ల పరంగా కూడా మజిలీ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్లుగానే మజిలీ చిత్ర ఫస్ట్ డే కలెక్షన్లు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రలో మజిలీ వసూళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం!

పెళ్ళైన తర్వాత

పెళ్ళైన తర్వాత

సమంత, చైతులకు సూపర్ హిట్ జోడి అనే పేరు ఉంది . ఏ మాయచేశావే, మనం, ఆటోనగర్ సూర్య లాంటి చిత్రాల్లో చైతు సమంత జంటగా నటించారు. వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత జంటగా నటించిన తొలి చిత్రం మజిలీ. వీరిద్దరి క్రేజ్ తో మజిలీ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కుతాయని సినీ విశ్లేషకుల్లో అంచనాలు ఉన్నాయి. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా సాగే మజిలీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

చైతు కెరీర్‌లో సెకండ్ హైయెస్ట్

చైతు కెరీర్‌లో సెకండ్ హైయెస్ట్

మజిలీ చిత్రం తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.95 కోట్ల షేర్ రాబట్టింది. ఎన్నికల హడావిడి నెలకొని ఉన్న సమయంలో ఇవి మంచి వసూళ్లే. నాగ చైతన్య కెరీర్ లో మజిలీ చిత్రం రెండవ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా నిలిచింది. గత ఏడాది చైతు నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.45 కోట్ల షేర్ సాధించిన సంగతి తెలిసిందే.

నైజాంలో దూకుడు

నైజాంలో దూకుడు

నైజాంలో మజిలీ చిత్ర థియేట్రికల్ హక్కులు 6 కోట్లకు అమ్ముడయ్యాయి. తొలి రోజే ఈ ప్రాంతంలో మజిలీ చిత్రం 1.85 కోట్ల షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా మజిలీకి మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఉత్తరాంధ్రలో 76 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 27 లక్షలు, గుంటూరులో 66 లక్షల వసూళ్లు మజిలీ చిత్రం సాధించింది. సీడెడ్ లో 63 లక్షల వసూళ్లు నమోదయ్యాయి.

హిట్ కావాలంటే

హిట్ కావాలంటే

మజిలీ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 21.14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం హిట్ కావాలంటే అంతకు మించిన వసూళ్లు సాధించాలి. తొలి రోజు మంచి వసూళ్లు సాధించడం, పాజిటివ్ టాక్, శనివారం రోజు ఉగాది సెలవు కావడం లాంటి అంశాలు ఈ చిత్ర వసూళ్లు మరింతగా పుంజుకునేందుకు ఉపయోగపడనున్నాయి. గోపి సుందర్, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X