నాలుగు రోజుల్లోనే పని పూర్తి చేసిన మజిలీ.. భారీ లాభాల దిశగా చైతు, సమంత చిత్రం!
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం గత శుక్రవారం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి మంచి రివ్యూలు ఇచ్చారు.పాజిటివ్ టాక్ తో మజిలీ వసూళ్లు అదుర్స్ అనిపించే విధంగా నమోదవుతున్నాయి. మజిలీ చిత్ర నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. మజిలీ చిత్ర నాలుగు రోజుల వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఎమోషనల్ ఎంటర్టైనర్
మజిలీ చిత్రం ఎమోషనల్ గా సాగే కుటుంబ కథా చిత్రం. నాగ చైతన్య, సమంత అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు శివ నిర్వాణ మరోసారి మ్యాజిక్ చేశారు. సమంత, నాగ చైతన్య జోడికి ఉన్న క్రేజ్ తో మజిలీ చిత్రం మంచి వసూళ్లు రాబడుతుందని అంతా ఊహించారు. సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుండడంతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

నాలుగు రోజుల వసూళ్లు
మజిలీ చిత్రం వీకెండ్ ముగిసిన తర్వాత వీక్ డేస్ లో కూడా దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లో మజిలీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 35. 5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో షేర్ విలువ 21.5 కోట్లు.తొలి వీకెండ్ లో ఈ చిత్రం 17.7 కోట్ల షేర్ రాబట్టింది. సోమవారం కూడా దాదాపు 3 కోట్ల పైగా షేర్ వసూలు చేయడంతో మజిలీ వసూళ్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో అర్థం అవుతుంది. మంగళవారం అందిన రిపోర్ట్స్ ప్రకారం మజిలీ చిత్రం 40 కోట్ల గ్రాస్ అధికమించినట్లు తెలుస్తోంది.

లాభాల పంట
మజిలీ చిత్ర థియేట్రికల్ హక్కులు 21.14 కోట్లకు అమ్ముడయ్యాయి. నాల్గవ రోజే మజిలీ బ్రేక్ ఈవెన్ సాధిస్తూ 21.5 కోట్ల షేర్ వసూలు చేసింది. దీనితో మజిలీ 100 శాతం రికవరీ సాధించినట్లు అయింది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. ఈ చిత్రం విడుదలై వారం కూడా గడవలేదు. అప్పుడే బ్రేక్ ఈవెన్ సాధించడంతో లాంగ్ రన్ లో బయ్యర్లు భారీ లాభాలు ఆర్జించబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఏరియాల వారీగా
మజిలీ చిత్రం నైజాం ఏరియాలో నాలుగురోజుల్లో 6.8 కోట్ల షేర్ రాబట్టింది. వైజాగ్ లో 2.35 కోట్ల, సీడెడ్ లో 2.37 కోట్లు, గుంటూరులో 1.4 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. నైజాం, సీడెడ్ ప్రాంతాల బయ్యర్లు ఇప్పటికే లాభాలు అందుకుంటున్నారు. యూఎస్ లో మజిలీ చిత్రాన్ని 3 కోట్లకు కొనుగోలు చేయగా ఇప్పటికే 2. 45 కోట్ల షేర్ రాబట్టింది. నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు సాధించిన చిత్రంగా మజిలీ రికార్డ్ క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











