సమంత, నాగచైతన్య మ్యాజిక్... రికార్డుస్థాయిలో 15 కోట్ల మజిలీ!
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న మజిలీ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. అలాగే నిన్నుకోరి సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం క్రేజీ టాక్‌ను సొంతం చేసుకొంటున్నది. చాలా రకాల పాజిటివ్ అంశాలతో రిలీజ్‌కు సిద్ధమవుతున్న మజిలీ చిత్రం రికార్డుస్థాయిలో ప్రి రిలీజ్ జరుపుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

చైతూ, సామ్ నాలుగోసారి జంటగా
ఏం మాయ చేశావే సినిమాతో ప్రారంభమైన వారి ప్రేమ, సినీ ప్రయాణం ఆరంభమైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వారిద్దరూ కలిసి నాలుగోసారి నటిస్తున్న చిత్రం మజిలీ. ఈ చిత్రంలో భార్య, భర్తలుగా కూడా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చైతూ క్రికెటర్‌గా కనిపించడం గమనార్హం

రూ.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న మజిలీ చిత్రం భారీగా రూ.15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ రాబట్టుకొన్నది అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ప్రఖ్యాత టెలివిజన్ ఛానెల్ రూ.5 కోట్లు వెచ్చించి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

రికార్డు రేటుకు డిజిటల్ రైట్స్
ఇక డిజిటల్ హక్కులు కూడా రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నది. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.3.5 కోట్లు చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకొన్నట్టు తెలుస్తున్నది. ఇక డబ్బింగ్ రైట్స్‌తో మరో రూ.4 కోట్లను మజిలీ నిర్మాతలు ఖాతాలో వేసుకొన్నారట.

పాజిటివ్ టాక్‌తో మజిలీ
రంగస్థలం నుంచి సమంత వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నది. యూటర్న్ కూడా మంచి లాభాలను రాబట్టింది. ఇక శైలజారెడ్డి అల్లుడుతో నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టాడు. దాంతో ఈ జంట బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











