twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న ‘మజిలీ’

    |

    నాగ చైతన్య, సమంత ప్రధాన పాత్రల్లో రూపొందినప 'మజిలీ' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. సినిమా విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు ఊపందుకున్నాయి. ఈ చిత్రం తొలి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 20 కోట్ల మార్క్ క్రాస్ అయింది.

    పెళ్లి తర్వాత సమంత, నాగ చైతన్య కలిసి నటించిన తొలి సినిమా కావడం, సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు ఉండటంతో ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం తొలి రోజే రూ. 11.50 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసి అదరగొట్టింది. నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

    పోటెత్తిన ఫ్యామిలీ ప్రేక్షకులు

    పోటెత్తిన ఫ్యామిలీ ప్రేక్షకులు

    సినిమా విడుదలకు ఒక రోజు ముందే హైదరాబాద్‌లో సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారు. సినిమా చూసిన పలువురు టాలీవుడ్ స్టార్స్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసల వర్షం కురపించారు. డైరెక్టర్ శివ నిర్వాణ కథను నడిపించిన తీరు అద్భుతంగా ఉంది అంటూ పొగడ్తలు గుప్పించారు. దీనికి తోడు రిలీజ్ రోజు ట్విట్టర్ రివ్యూస్ కూడా పాజిటివ్‌గా రావడంతో ఉగాది సందర్భంగా ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు.

    2 రోజుల గ్రాస్ కలెక్షన్ ఎంతంటే...?

    2 రోజుల గ్రాస్ కలెక్షన్ ఎంతంటే...?

    సినిమాకు స్ట్రాంగ్ మౌత్ టాక్, పాజిటివ్ రివ్యూలు రావడంతో మొదటి రెండు రోజుల్లో వసూళ్లు అదిరిపోయాయి. తొలి రోజు రూ. 11.50 కోట్లు రాబట్టిన ఈచిత్రం రెండో రోజు రూ. 10 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో 2 డేస్ టోటల్ రూ. 21.5 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ అయింది.

    మూడు రోజుల్లో పెట్టుబడి రికవరీ దిశగా...

    మూడు రోజుల్లో పెట్టుబడి రికవరీ దిశగా...

    ఈ చిత్రాన్ని రూ. 20 కోట్ల బడ్జెట్ రేంజిలో నిర్మించారు. థియేట్రికల్ రైట్స్ అమ్మడం ద్వారా రూ. 21.14 కోట్లు వచ్చాయి. సినిమా విడుదలైన 2 రోజుల్లోనే రూ. 13.05 కోట్ల షేర్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. ఆదివారం కలెక్షన్లతో వారు పెట్టిన టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు.

    ఏరియా వైజ్ షేర్

    ఏరియా వైజ్ షేర్

    ఏరియా వైజ్ షేర్ కలెక్షన్లు పరిశీలిస్తే... నైజాం రూ. 3.76 కోట్లు, సీడెడ్ 1.31 కోట్లు, వైజాగ్ రూ. 1.40 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 60 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 48 లక్షలు, కృష్ణ రూ. 73 లక్షలు, గుంటూరు రూ. 98 లక్షలు, నెల్లూరు రూ. 30 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 1.54 కోట్లు, ఓవర్సీస్ రూ. 1.89 కోట్లు... టోటల్ రూ. 13.05 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

    English summary
    Majili starring Naga Chaitanya and Samantha Akkineni, made a fantastic collection at the worldwide box office, its total collection Rs 21.19 crore gross in 2 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X