twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మజిలీ’ మూవీ యూఎస్ఏ ఓపెనింగ్ కలెక్షన్స్ సూపర్!

    |

    నాగ చైతన్య, సమంత, దివ్యాంన్ష కౌశిక్ ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'మజిలీ' ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన అన్ని ఏరియాల్లో సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

    'నిన్నుకోరి'తో సూపర్‌హిట్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ నుంచి వస్తున్న సినిమా కావడం, పెళ్లి తర్వాత చై-సామ్ జంటగా చేసిన చిత్రం కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌పై పడింది. యూఎస్ఏలో ఒక రోజు ముందుగానే ప్రదర్శించిన ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    సంతృప్తికరంగా ఓపెనింగ్స్

    సంతృప్తికరంగా ఓపెనింగ్స్

    యూఎస్ఏ బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘మజిలీ' చిత్రం ప్రీమియర్ షోల ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువే వసూలైంది. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 4, రాత్రి 7.20 గంటల వరకు 112 లొకేషన్ల నుంచి $125,149 డాలర్లు రాబట్టింది.

    లొకేషన్ యావరేజ్

    లొకేషన్ యావరేజ్

    ఈ మూవీ లొకేషన్ యావరేజ్... $1,117 రాబట్టింది. నాగ చైతన్య స్టార్ ఇమేజ్, యూఎస్ఏ మార్కెట్లో అతడి సినిమాలకు ఉన్న క్రేజ్‌తో కంపేర్ చేసి చూస్తే ఇది చాలా మంది కలెక్షన్సే అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నమాట.

    సూపర్ హిట్ టాక్

    సూపర్ హిట్ టాక్

    కాగా... సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో మనసుకు హత్తుకునే లవ్, ఎమోషనల్ సినిమాలు రాలేదని, శివ నిర్వాణ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం చాలా గొప్పగా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. దీంతో సినిమా ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీసు వద్ద అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

    మజిలీ ప్రీ రిలీజ్ బిజినెస్

    మజిలీ ప్రీ రిలీజ్ బిజినెస్

    ‘మజిలీ' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తొలివారంలోనే ఈ చిత్రం గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ రైట్స్ రూ. 3 కోట్లకు అమ్ముడయ్యాయి.

    మజిలీ

    మజిలీ

    దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో చైతూ క్రికెటర్‌గా కనిపించాడు. రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ, సంగీతం: గోపీ సుంద‌ర్, సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు శ‌ర్మ, ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్, ఎడిట‌ర్: ప‌్ర‌వీణ్ పూడి, యాక్ష‌న్: వెంక‌ట్.

    English summary
    "Majili USA hourly gross at 7:20 pm PST on 4 April is $125,149 from 112 locations with per location avg of $1,117. Very good." Film critic tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X