twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Major movie closing collections.. క్లీన్‌గా సూపర్ హిట్.. ప్రపంచవ్యాప్తంగా లాభం ఎంతంటే?

    |

    ముంబై నగరంపై పాక్ ముష్కరుల దాడి సమయంలో తాజ్ హోటల్‌లో జరిగిన మారణకాండలో అమరుడైన ఎన్ఎస్‌జీ కమాండర్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. గత మూడు వారాలుగా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా భావోద్వేగానికి గురిచేసింది. అయితే గత 18 రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు లాభాలను సాధించిందంటే..

    గత మూడు వారాల్లో

    గత మూడు వారాల్లో

    సినీ పరిశ్రమలో గత మూడు వారాల్లో పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎక్కువ శాతం సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురయ్యాయి. అయితే విక్రమ్ లాంటి భారీ చిత్రాన్ని నుంచి ఎదురైన పోటీ నుంచి తట్టుకొని మేజర్ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఏ సినిమా సాధించని విధంగా మేజర్ మూవీ భారీ లాభాలను డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు, నిర్మాతలకు సంపాదించిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 30 కోట్ల గ్రాస్ వసూళ్లను, దాదాపు 18 కోట్ల షేర్‌ను రాబట్టింది. దీంతో ఈ చిత్రం సుమారు 10 కోట్లకుపైగా లాభాలను పంచిపెట్టింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు 6 కోట్ల మేర బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో..

    కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో..

    మేజర్ చిత్రం కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లనే రాబట్టింది. ఈ చిత్రం కర్ణాటక, తమిళనాడులో 2 కోట్లు రాబట్టింది. అయితే హిందీ, ఇతర భాషల్లో మేజర్ చిత్రం మొత్తంగా 6.5 కోట్లు వసూలు చేసింది. ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రం ఈ రేంజ్ వసూళ్లను సాధించడంపై ట్రేడ్ వర్గాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి.

    ఓవర్సీస్ మార్కెట్‌లో

    ఓవర్సీస్ మార్కెట్‌లో

    ఇక మేజర్ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ లభించింది. అమెరికా, ఇతర ప్రాంతాల్లో సుమారు 6.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 32.5 కోట్ల షేర్, 62 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ప్రపంచవ్యాప్తంగా లాభం ఎంతంటే?

    ప్రపంచవ్యాప్తంగా లాభం ఎంతంటే?

    అయితే మేజర్ సినిమా రిలీజ్‌కు ముందు ఓ మీడియం రేంజ్ సినిమా చేసినట్టుగానే బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులను 13 కోట్ల మేరకు అమ్మడం జరిగింది. దాంతో ఈ సినిమా 14 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. చివరకు ఈ సినిమా దాదాపు 18 కోట్ల మేర లాభాలను సాధించింది. 2022‌లో క్లీన్ సూపర్ హిట్‌గా మేజర్ నిలిచింది.

    English summary
    Major movie's box office run almost over. After 18 days of run at box office, This movie gets 18 crores profit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X