Major Movie day 1 collections వన్‌సైడ్ పాజిటివ్ టాక్.. మరి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరిస్థితి ఏమిటంటే?

ముంబై నగరంపై పాక్ ముష్కరుల 26/11 దాడి ఘటనలో ఆత్మత్యాగం చేసిన అమర జవాను సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ నేపథ్యంగా రూపొందిన మేజర్ చిత్రం సాధారణ ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నది. ఈ చిత్రానికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్లకు దక్షిణాదిలో అనూహ్యమైన స్పందన లభించింది. అయితే ఈ సినిమా సాధించబోయే తొలి రోజు కలెక్షన్ల అంచనాలు ఎలా ఉన్నాయంటే..

ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల సంఖ్య

మేజర్ సినిమా రిలీజైన థియేటర్ల సంఖ్య విషయానికి వస్తే.. నైజాంలో 135 కుపైగా, సీడెడ్‌లో 85 కుపైగా, ఆంధ్రాలో 190 పైగా, కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో 410 థియేటర్లకుపైగా, హిందీలో 400 థియేటర్లకుపైగా, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లకుపైగా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1500 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నట్టు సమాచారం.

నైజాం, ఆంధ్రాలో

నైజాం, ఆంధ్రాలో

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రాలో వైజాగ్‌లో మంచి స్పందన కనిపించింది. వైజాగ్‌లో ఐదు థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే వైజాగ్‌లో విడుదలైన అన్ని థియేటర్లలో కూడా హౌస్‌ఫుల్స్ కనిపించాయి. ఈ సినిమా మొత్తంగా తొలి రోజు 12.5 లక్షలకుపైగా వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విజయవాడలో 15 లక్షలు, చీరాలలో 2 లక్షలకుపైగా వసూళ్లను సాధించింది. ఇంకా పలు చోట్ల నుంచి వివరాలు అందాల్సి ఉంది.

హైదరాబాద్‌లో కలెక్షన్లు

హైదరాబాద్‌లో కలెక్షన్లు


ఇక నైజాంలోని సినీ రాజధానిగా పేర్కొనే హైదరాబాద్‌లో మొత్తంగా 302 మేజర్ సినిమా షోలను ప్రదర్శించారు. తొలి రోజు 61 శాతం అక్యుపెన్సీ నమోదైంది. సుమారుగా ఈ చిత్రం 1.24 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంకా చాలా ప్రాంతాల నుంచి వివరాలు అందాల్సి ఉంది.

 అమెరికాలో తొలి రోజు

అమెరికాలో తొలి రోజు


అలాగే అమెరికాలో ప్రీమియర్లకు, తొలి రోజు భారీ స్పందన కనిపించింది. మీడియం రేంజ్ సినిమాల్లో మంచి కలెక్షన్లను నమోదు చేసింది. 257 లొకేషన్లలో మొత్తం 352k డాలర్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

హిందీ వెర్షన్‌ కలెక్షన్ల అంచనా

హిందీ వెర్షన్‌ కలెక్షన్ల అంచనా

మేజర్ సినిమా హిందీ వెర్షన్‌ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోయింది. మొత్తంగా 35 శాతం అక్యుపెన్సీతో తొలి రోజు కొనసాగింది. బెంగళూరులో 30 లక్షలు, చెన్నైలో 6 లక్షలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో తొలి రోజు హిందీ వెర్షన్‌ 1.5 కోట్లు నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?


ప్రపంచవ్యాప్తంగా మేజర్ సినిమా అంచనా వసూళ్లు ఈ విధంగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నైజాంలో ఈ చిత్రం 3.5 కోట్ల గ్రాస్ నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రాలో 6.5 కోట్ల రాబట్టే అవకాశం ఉంది. సీడెడ్‌లో 1 కోటి రూపాయల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం 4.5 కోట్లు వసూలు చేయడానికి అవకాశం ఉంది. మొత్తంగా ఈ చిత్రం 16 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X