twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Major Movie day 2 collections మేజర్‌కు ఊహించని అడ్వాన్స్ బుకింగ్.. రెండో రోజు బాక్సాఫీస్ రిపోర్ట్ ఏమిటంటే?

    |

    ముంబై నగరంపై 26/11 దాడుల్లో ప్రాణ త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన మేజర్ చిత్రానికి సాధారణ ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా సెలబ్రిటీల ఆదరణ దక్కుతున్నది. అయితే హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. అయితే మేజర్ సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనాలు ఎలా ఉన్నాయంటే..

    రెండో రోజు భారీగా అక్యుపెన్సీ

    రెండో రోజు భారీగా అక్యుపెన్సీ


    మేజర్ చిత్రం తొలి రోజున 7 కోట్ల గ్రాస్, 4 కోట్ల షేర్ సాధించింది. రెండో రోజున కూడా ఈ చిత్రం అక్యుపెన్సీ భారీగా పెరిగింది. దాంతో ఈ చిత్రం రెండో రోజున కూడా మంచి కలెక్షన్లను సాధించవచ్చనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో ఏర్పడింది. హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 226 షోలు 17 శాతం అక్యుపెన్సీతో 25.7 లక్షల రూపాయల వసూలు చేసింది. కరెంట్ బుకింగ్ ద్వారా మరింతగా కలెక్షన్లు రాబట్టిందని చెప్పారు.

     హిందీ వెర్షన్ రెస్పాన్ ఇలా..

    హిందీ వెర్షన్ రెస్పాన్ ఇలా..


    తొలి రోజున మేజర్ చిత్రం హిందీ వెర్షన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 75 లక్షలు మాత్రమే తొలి రోజున వసూలు చేసింది. మౌత్ టాక్‌తో ఉత్తరాదిలో తొలి రోజుతో పోల్చుకొంటే 50 శాతం జంప్ కనిపించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హిందీ వెర్షన్ మొత్తంగా 2155 షోల ద్వారా 82 లక్షలు వసూలు చేసింది.

    దక్షిణాదిలో కూడా ఫర్వాలేదనిపించే..

    దక్షిణాదిలో కూడా ఫర్వాలేదనిపించే..


    ఇక దక్షిణాదిలో ప్రధాన నగరాలైన బెంగళూరులో 226 షోల ద్వారా 17 శాతం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 25.7 లక్షల రూపాయలు రాబట్టింది. అలాగే చెన్నైలో 45 షోల ద్వారా 40 శాతం అక్యుపెన్సీతో 5.8 లక్షలు రూపాయాలు సాధించింది.

     తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్

    తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్


    ఇక తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్సు బుకింగ్ భారీగా కనిపించింది. వరంగల్‌లో 6.35 లక్షలు, కరీంనగర్‌లో 1.33 లక్షలు, ఖమ్మంలో 1.76 లక్షలు సంపాదించింది. వైజాగ్‌లో 18.94 లక్షలు, రాజమండ్రిలో 2.69 లక్షలు, కాకినాడలో 2.07 లక్షలు, తిరుపతిలో 3.56 లక్షలు, విజయనగరంలో 2.73 లక్షలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సాధించింది.

     దేశవ్యాప్తంగా కలెక్షన్లు

    దేశవ్యాప్తంగా కలెక్షన్లు


    దేశవ్యాప్తంగా మేజర్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. ట్రేడ్ వర్గాలు సమాచారం ప్రకారం.. తెలుగులో 2.9 కోట్లు, హిందీ 70 లక్షలు, మలయాళంలో 2 లక్షలు నమోదైంది. మొత్తంగా 3.62 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికాలో రెండో రోజు 200k డాలర్లు రాబట్టినట్టు సమాచారం.

     రెండో రోజు ఎంత వసూలంటే?

    రెండో రోజు ఎంత వసూలంటే?


    ఇక మేజర్ చిత్రం తొలి రోజున 7.12 కోట్ల షేర్, 13.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజున కూడా ఈ చిత్రం మరో 10 నుంచి 13 కోట్ల మేర వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

    English summary
    Adivi Shesh's Major movie released on June 3rd worldwide. Here is the day 2 collections by Filmibeat Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X