Major 11 Days Collections: మేజర్‌కు వీక్ డే ఎఫెక్ట్.. మొట్టమొదటసారిగా భారీ డ్రాప్.. అయినా ఆ రికార్డుకు చేరువలో
అడివి శేష్ విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో సత్తా చాటుతూ వరుస విజయాలతో దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే అడివి శేష్ 'మేజర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచి కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం భారీగా పెరిగిన వసూళ్లు సోమవారం నాడు ఎలా ఉన్నాయి? 'మేజర్' మూవీ 11 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ లో చూద్దాం

'మేజర్'
అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క రూపొందించిన సినిమా 'మేజర్'. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. దేశభక్తుడు కథ కావడంతో ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాలో శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్, రేవతి మేజర్ తల్లితండ్రుల పాత్రలలో నటించారు.

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్
మహేష్ బాబు నిర్మాణంలో ఆయన సమర్పణలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన 'మేజర్' మూవీపై ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ కు కూడా స్పందన భారీగా వచ్చింది. దీంతో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయల మేర అమ్ముడైంది. హిందీ వెర్షన్ ఒక్కటే రూ. 5 కోట్లు బిజినెస్ అయింది. అలా ఈ సినిమాకు మొత్తం రూ. 18 కోట్ల బిజినెస్ జరిగింది.

11వ రోజు కలెక్షన్లు
'మేజర్'కు ఏపీ, తెలంగాణలో 11వ రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 1 లక్ష, కృష్ణాలో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. 1 లక్షతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 20 లక్షలు షేర్, రూ. 0.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

11 రోజుల్లో
'మేజర్' 11 రోజుల్లోనూ రెండు రాష్ట్రాల్లో బాగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 7.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.05 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.39 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 89 లక్షలు, గుంటూరులో రూ. 1.11 కోట్లు, కృష్ణాలో రూ. 1.02 కోట్లు, నెల్లూరులో రూ. 66 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 16.87 కోట్లు షేర్, రూ. 28. 10 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా
ఏపీ, తెలంగాణలో 11 రోజుల్లో రూ.16.87 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.90 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. వీటితో కలిపి 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 29.65 కోట్లు షేర్‌తో పాటు రూ.53.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

రికార్డుకు అతి చేరువలో అడివి శేష్
'మేజర్' అంచనాలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 110 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లోనే అడివి శేష్ నటించిన ఈ సినిమాకు రూ. 29.65 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు ఇప్పటికే రూ. 10.65 కోట్ల లాభాలు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా ఎట్టకేలకు 30 కోట్ల క్లబ్‌లో చేరడానికి చేరువైంది.


Click it and Unblock the Notifications











