Malaikottai Vaaliban Collections మోహన్ లాల్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా.. మలైకొట్టై వాలిబాన్‌కు ఎన్ని కోట్లంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సోనాలి కులకర్ణి నటించిన చిత్రం మలైకొట్టై వాలిబాన్. లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందింది. ఈ సినిమాను షిబై బేబీ జాన్, అచ్చు బేబీ జాన్, విక్రమ్ మెహతా తదితరులు నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 25వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్లు, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే..
మలైకొట్టై వాలిబాన్ విషయానికి వస్తే.. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ఈ సినిమా భారీ కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ వైపు వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక మలైకొట్టై వాలిబాన్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో రూపొందించారు. సినిమా ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలతో కలిపి మొత్తంగా 65 కోట్ల రూపాయలు అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా 70 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది.
మలైకొట్టై వాలిబాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. ఈ సినిమా కేరళలో 3.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.5 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా 5 కోట్ల వసూళ్లను అడ్వాన్సు బుకింగ్ రూపంలో సాధించింది.
మలైకొట్టై వాలిబాన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ తొలి రోజున ఇండియాలో 8 కోట్లు, మలయాళంలో 7 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మలైకొట్టై వాలిబాన్ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా రెండో రోజు 2 కోట్ల రూపాయలు ఇండియాలో, 1 కోటి రూపాయలు ఓవర్సీస్‌లోొ రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మలైకొట్టై వాలిబాన్ మూవీ 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా మలయాళంలో 1.75 కోట్ల రూపాయలు నికరంగా 3 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











