Malaikottai Vaaliban Collections మోహన్ లాల్ కలెక్షన్ల రచ్చ.. మలైకొట్టై వాలిబన్‌కు ఎన్ని కోట్ల వసూళ్లంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సోనాలి కులకర్ణి, హరీష్ పేరడి, సుచిత్ర నాయర్, హరిప్రశాంత్ తదితరులు నటించిన చిత్రం మలైకొట్టై వాలిబన్. లిజో జోస్ పెలిస్సెరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షిబు బేబీ, సిద్దార్థ్ ఆనంద్ కుమార్, విక్రమ్ మెహతా తదితరులు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై మ్యూజిక్, మధు నీలకందన్ సినిమాటోగ్రఫిని అందించారు. ఈ చిత్రం జనవరి 25వ తేదీన రిలీజ్ అవుతున్నది. అయితే సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...
మలైకొట్ట వాలిబన్ చిత్రాన్ని భారీ తారాగణంతోపాటు అత్యధిక బడ్జెట్‌తో పిరియాడిక్ ఫిలింగా రూపొందించారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ను వేశారు. ఈ సినిమా నటీనటులు పారితోషికాలు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 75 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక మలైకొట్ట వాలిబన్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇండియాలో సెంచురీ ఫిల్మ్స్, ఓవర్సీస్‌లో ఫార్ ఫిల్మ్ కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ కో ఎల్ఎల్సీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. మలయాళంలో 1500 షోలు, తమిళనాడులో 13 షోలు, కర్ణాటకలో 70 షోలు, తెలుగులో 6 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.
కేరళలో మోహన్ లాల్ సినిమాకు విశేషమైన ఆదరణ దక్కుతున్నది. మలయాళంలో ఇప్పటికే 1.5 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇండియాలో ఈ సినిమాకు 1.7 లక్షల టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఈ సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మలైకొట్ట వాలిబన్ సినిమాకు కొచి, త్రివేండ్రం, కోజికోడ్, త్రిచూర్, చెన్నై, బెంగళూరులో భారీ స్పందన కనిపిస్తున్నది. ఇప్పటీకే పలు చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. రానున్న రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
మలైకొట్టై వాలిబన్ సినిమా ఇప్పటికీ కేరళలో 2.5 కోట్ల రూపాయలు కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. ఇక కర్ణాటకలో 20 లక్షలు, ఏపీలో 1 లక్ష, తమిళనాడులో 1.15 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 2.8 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు వసూలు చేసింది.
మల్లైకొట్టై వాలిబన్ చిత్రం 2వ రోజు అడ్వాన్స్ బుకింగ్
మలైకొట్టై వాలిబన్ ఢిల్లీలో 50 వేల రూపాయలు, ముంబైలో 70 వేల రూపాయలు, బెంగళూరులో 20 లక్షల రూపాయలు, చెన్నైలో 2.23 లక్షలు, హైదరాబాద్‌లో 2.5 లక్షలు, అలెప్పీలో 10 లక్షల రూపాయలు, త్రిచూర్‌లో 20 లక్షలు, కోజికోడ్ 15 లక్షలు, కొల్లాం 13 లక్షలు, కొట్టాయం 8 లక్షలు రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు అయ్యాయి. కేరళలో 2.5 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











