Malayalee from India 5 days collections కోట్లు కుమ్మరిస్తున్న మలయాళీ సినిమా.. 5 రోజుల్లో రికార్డు కలెక్షన్లు
మలయాళంలో చిన్న చిత్రాలు, కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలకు బాక్సాఫీస్ వద్ద భారీ ఆదరణ దక్కుతున్నది. తాజాగా మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై డిజో జోస్ ఆంటోని దర్శకత్వంలో రూపొందిన మలయాళీ ఫ్రమ్ ఇండియా చిత్రం అత్యధిక వసూళ్లను నమోదు చేస్తున్నది. నివీన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్, షైన్ టామ్ చాకో తదితరులు నటించిన ఈ సినిమా కోట్ల వర్షాన్ని కురిపిస్తున్నది. ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మలయాళీ ఫ్రమ్ ఇండియా చిత్రం మీడియం బడ్జెట్‌తో రూపొందింది. ప్రతిభావంతులైన నటులు, టాప్ టెక్నిషియన్స్, సీనియర్, నవతరం టీమ్‌తో మేళవించి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలతో కలిపి ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.

నివీన్ పౌలీ నటించిన ఈ సినిమాకు ఐదో రోజు కూడా మెరుగైన కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఆదివారం 40 శాతం కలెక్షన్లను రాబట్టింది. త్రిచూర్‌లో 60 శాతం, కొల్లాంలో 45 శాతం, కోజికోడ్‌లో 50 శాతం, అలెప్పీలో 67 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 35 శాతం ఆక్యుపెన్సీ, బెంగళూరులో 30 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.
మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమా తొలి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్లు సాధించింది. మొదటి రోజు ఈ సినిమా 3 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక రెండో రోజు 1.5 కోట్లు, మూడో రోజు 1 కోటి రూపాయలు, నాలుగో రోజు 1.2 కోట్లు, 5వ రోజు 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో కేరళ, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 7.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక ఈ మూవీకి ఓవర్సీస్‌లో కూడా మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా రిలీజైన చోట ప్రశంసలతోపాటు వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దాంతో ఈ సినిమా 5 రోజుల్లో 10.5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించినట్లయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











