Malayalee from India Collections మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీకి సూపర్ హిట్ టాక్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మలయాళ సినిమా పరిశ్రమ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. ప్రస్తుత ఏడాదిలో భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక బ్లాక్ బస్టర్లను నమోదు చేసింది. కేవలం హిట్ మాత్రమే కాకుండా ఈ సినిమా పరిశ్రమ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. అయితే తాజాగా మరో సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్నది. నవీన్ పౌలీ నటించిన మలయాళీ ఫ్రమ్ ఇండియా (Malayalee from India) అనే సినిమా మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందనే వివరాల్లోకి వెళితే..

మలయాళీ ఫ్రమ్ ఇండియా (Malayalee from India) సినిమా విషయానికి వస్తే.. ఇందులో అనస్వర రాజన్, ద్యాన్ శ్రీనివాసన్, షైనా్ టామ్ చాకో, మంజు పిళ్లై, డిజో జోస్ ఆంటోని, ఆంజు వర్గీస్ తదితరులు నటించారు. ఈ సినిమాకు డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించగా. లిస్టిన్ స్టిఫెన్ నిర్మించారు. ఈ సినిమాకు సందీప్ ఎలామాన్ సినిమాటోగ్రఫి, జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు.

Malayalee from India Box Office Expected Collections Worldwide

మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ మూవీని రిచ్‌గా నిర్మించారు. ఏ బాధ్యత లేని ఓ యువకుడి జీవితంలో ఏం జరిగింది? రాజకీయాలు, స్నేహం అంశాల ఆధారంగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఇక సినిమా ప్రోమోలు, ప్రమోషన్స్‌కు మంచి రెస్సాన్స్ రావడంతో 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇక మూవీ అడ్వాన్స్ బుకింగ్ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి కోటి రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రావడంతో కరెంట్ బుకింగ్ ఊపుందుకొన్నది. మార్నింగ్ షో తర్వాత ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు మిగితా షోలకు జనం పొటెత్తారు. అంతేకాకుండా ఈ సినిమా తొలి రోజు భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి.

Malayalee from India Box Office Expected Collections Worldwide

ఇక ఈ మూవీ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 65 శాతం, మ్యాట్నీకి 70 శాతం, ఫస్ట్ షోకు 65 శాతం, సెకండ్ షోకు 70 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక ఈ సినిమాకు కోచిలో 90 శాతం, త్రివేండ్రంలో 70 శాతం, త్రిచూర్‌లో 70 శాతం, కొల్లాంలో 81 శాతం, అలెప్పిలో 93 శాతం, హైదరాబాద్‌లో 40 శాతం, ముంబైలో 55 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వస్తే.. మే 1 హాలీడే కావడంతో రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా మొదటి రోజు 3 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపారు. ఓవర్సీస్‌లో కూడా భారీ ఓపెన్సింగ్ నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ సినిమాతో మలయాళ సినిమా పరిశ్రమ మరో హిట్‌ను ఖాతాలో వేసుకొన్నదని ట్రేడ్ రిపోర్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X